Begin typing your search above and press return to search.
వైద్య, ఆరోగ్య మంత్రికి వైరస్ లక్షణాలు ..అమిత్ షా తో భేటీ ముగిసిన కాసేపటికే ..
By: Tupaki Desk | 16 Jun 2020 8:15 AM GMTదేశంలో వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని విదంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 41 వేల మందికి పైగా ఢిల్లీవాసులు వైరస్ బారిన పడ్డారు. ఈనెల చివరికి వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకి పైగా నమోదు అయ్యే అవకాశం ఉండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అందుకుతగ్గ ఏర్పాట్లు చేస్తుంది.
తాజాగా కేజ్రీవాల్ కేబినెట్ మంత్రికి సైతం ఈ వైరస్ సోకింది. వైద్య, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ లక్షణాలతో మంగళవారం తెల్లవారు జామున ఆయన ఢిల్లీ దిల్షద్ గార్డెన్, తహార్ పూర్ ప్రాంతంలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి సత్యేంద్ర జైన్ ఉన్నట్టుడి హైఫీవర్ కు గురయ్యారు. అలాగే, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు తలెత్తాయి. దీనితో వెంటనే ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసరంగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయన వైరస్ నిర్దారణ పరీక్షలు చేసారు. ఫలితం ఇంకా రావాల్సి ఉంది. అయితే , వైద్యులు ప్రాధమిక టెస్టుల్లో వైరస్ సోకినట్లు అంచనాకి వచ్చారు.
ఢిల్లీలో వైరస్ స్థితిగతులను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిర్వహించిన సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సత్యేంద్ర జైన్ పాల్గొన్నారు. తొలి రోజు ఢిల్లీ ప్రభుత్వంతో.. మరుసటి రోజు ఢిల్లీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు అమిత్ షా. అఖిలపక్ష భేటీ ముగిసిన రోజు రాత్రే సత్యేంద్ర జైన్ హైఫీవర్ కు గురయ్యారు. దీనిపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ ..ఆయన గత కొన్ని రోజులు గా విశ్రాంతి లేకుండా గడుపుతున్నారని, వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచీ ఆయన తరచూ అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారని , ఇక విశ్రాంతి తీసుకోవాలని సత్యేంద్ర జైన్ కు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.