Begin typing your search above and press return to search.
జనాలకే కాదు.. కోర్టుకు కూడా కాలిపోయేలా చేసిన కాలర్ ట్యూన్
By: Tupaki Desk | 14 May 2021 4:30 AM GMTమామూలు రోజుల్ని కాస్తో.. కూస్తో అర్థం చేసుకోవచ్చు. కరోనా టైంలో.. ఎవరికైనా ఫోన్ చేయటానికి కులాసా కంటే కూడా అర్జెంట్ గా.. మహా అర్జెంట్ అయిన సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. ఇలాంటివేళ.. కరోనా మీద సమరం చేసే టీకా మీద విడిచి పెట్టకుండా ఉండే కాలర్ ట్యూన్ దేశ ప్రజల్ని అమితంగా ఇరిటేట్ చేస్తుంది. కాలర్ ట్యూన్ ఏదైనా సరే.. పరిమిత కాలం వరకు ఓకే. అందునా.. మరీ సుదీర్ఘంగా సాగటమే కాదు.. ఆ సోది సందేశం మొత్తం పూర్తి అయ్యాక మాత్రమే కాల్ కనెక్టు కావటం మహా ఇబ్బందిగా మారింది.
ఏదైనా వైద్య సాయం అవసరమైనప్పుడు.. వరుసగా ఫోన్లు చేయాలన్నప్పుడు కూడా విడవకుండా వచ్చే కాలర్ ట్యూన్లకు ఒక్కోసారి ఫోన్లు కింద పడేసి బద్ధలు కొట్టేయాలన్న కోపం చాలామందికి తన్నుకు వస్తోంది. అయినప్పటికి కేంద్ర ఆదేశాల పుణ్యమా అని.. టెలికం కంపెనీలు ఫాలో అవుతున్న ఈ కాలర్ ట్యూన్లు జాతి జనుల సహనానికి పరీక్షగా మారుతున్నాయి. కోట్లాది మందిని ఇరిటేట్ చేస్తున్న ఈ కాలర్ ట్యూన్ మీద ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
సరిపడా టీకాలు లేవు కానీ ఫోన్ లో కాలర్ ట్యూన్.. సందేశాల ద్వారా విసిగిస్తున్నారంటూ కేంద్రం మీద ఫైర్ అయ్యింది. దేశంలోని ప్రజలందరికి ఉచితంగా కోవిడ్ టీకా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించటం.. మే 1 నుంచి దేశ వ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా సందేశాన్ని వినిపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్న వేళ.. అందుకు ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ లో చిరాకు కాలర్ ట్యూన్ తో విసిగిస్తున్నారు.. ఇదెంత కాలం కొనసాగుతుందో తెలియదు.. మీరు ప్రజలకు టీకాలు వేయాలి.. కానీ మీ దగ్గర సరిపడా టీకాలు లేవు.. మరెందుకు తప్పకుండా టీకాలు వేసుకోవాలని ప్రజలకు కాలర్ ట్యూన్ ద్వారా చెబుతున్నారంటూ సూటిగా ప్రశ్నించింది. ‘మరి వీరికి టీకా ఎలా అందుతుంది? వారికి టీకా ఎవరు వేస్తారు? ఆ సందేశం ఉద్దేశం ఏమిటి? మీరు ప్రతి ఒక్కరికి టీకా అందించాలి. ఇంకో పదేళ్లు ఈ సందేశం కొనసాగేలా కనిపిస్తోంది’’ అని మండిపడింది.
అంతేకాదు.. సందేశాన్ని చెప్పటం కంటే కూడా ఏదైనా ఎక్కువ చేయాల్సి ఉంటుందని.. ఇంకేదైనా కొత్తది వింటే కొంత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఒకవేళ డబ్బులు తీసుకున్నా టీకా అందరికి ఇవ్వాలని.. ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుస్తోందని జస్టిస్ విపిన్ సంఘి.. రేఖా పల్లితో కూడిన ధర్మాసం ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే క్రమంలో మీడియాకు కొన్ని సూచనలు చేస్తూ.. టీవీ కార్యక్రమాల్లో యాంకర్లు ఆక్సీజన్ సాంద్రత.. సిలిండర్ వాడకం.. టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఫోకస్ చేయాలని కోరింది. అమితాబ్ లాంటి వారు దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యను చేయటం గమనార్హం. ప్రజలకు త్వరగా సందేశాలు చేరాలంటే ఎవరిని వినియోగించాలన్న విషయంపై ఢిల్లీ హైకోర్టుకు మంచి అవగాహనే ఉన్నట్లు అనిపించట్లేదు?