Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారుకు ఫోన్ ట్యాపింగ్ తలనొప్పి!
By: Tupaki Desk | 20 March 2019 5:09 AM GMTఏపీ ప్రభుత్వానికి సరకొత్త తలనొప్పి షురూఅయ్యింది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి కోర్టుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి జగన్ పార్టీ నేతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుకు సంబంధించి తాజాగా ఏపీ సర్కారుకు.. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. సర్వీసు ప్రొవైడర్లకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తమ పార్టీ నేతల ఫోన్లను ఏపీ సర్కారు ట్యాప్ చేస్తుందని.. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు తాజాగా విచారణ జరిపింది.
ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును ఏపీ సర్కారుకు పంపిన హైకోర్టు.. తమకు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఇందులో భాగంగా కేంద్రానికి.. సర్వీసు ప్రొవైడర్లకు కూడా నోటీసులు పంపి.. వివరణ కోరింది. వారం లోపు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. మరీ.. వ్యవహారం రానున్న రోజుల్లో బాబుకు ఎలాంటి ఇబ్బందుల్ని కలిగిస్తుందో చూడాలి.