Begin typing your search above and press return to search.
హైకోర్టు డెడ్ లైన్.. చిదంబరం కేసులో ట్విస్ట్
By: Tupaki Desk | 20 Feb 2020 11:45 AM GMTవిదేశాల్లోని పలు బోగస్ కంపెనీలకు లంచాలుగా తరలించిన సొమ్ము వెలుగులోకి రావడంతో ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్ -మాక్సిస్ కేసుల్లో సీబీఐ అభియోగాలు మోపి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రధాన కార్యాలయంలో రిమాండ్ కు తీసుకొని విచారించింది. కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తరలించారు. చిదంబరంకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ కేసు విచారణలో సీబీఐ అంతులేని జాప్యం చేస్తోంది. దీంతో విచారణ పూర్తి చేయడానికి ఢిల్లీ హైకోర్టు అల్టీమేటం జారీ చేసింది. గతంలో సీబీఐ, ఈడీలు వాయిదాలు కోరడంతో సెప్టెంబర్ 5వరకు విచారణ వాయిదా వేసింది.
తాజాగా ఈ కేసులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. నాలుగు దేశాలకు ఎల్ఆర్ లు పంపామని.. ఆ దేశాలు స్పందన కోసం ఎదురుచూస్తున్నామని కోర్టుకు తెలిపింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టింది. మే 4వ తేదికి నాటికి విచారణ పూర్తి చేయాలంటూ సీబీఐ, ఈడీకి గడువు విధించింది. ఈ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి ప్రధాన నిందితులుగా ఉన్నారు.