Begin typing your search above and press return to search.
మహిళలకు మినహాయింపు ఎందుకివ్వాలి?
By: Tupaki Desk | 31 Dec 2015 4:51 AM GMTహడలెత్తిస్తోన్న వాయుకాలుష్య భూతంపై దేశంలో తొలిసారి ప్రయోగాత్మకంగా ఢిల్లీ రాష్ట్ర సర్కారు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిత్యం రోడ్ల మీదకు వచ్చే లక్షలాది వాహనాలపై నియంత్రించాలన్న ఉద్దేశంతో సరి.. బేసి విధానాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. చైనా రాజధాని బీజింగ్ లో ఎంతోకాలంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని జనవరి 1 నుంచి ఢిల్లీ మహానగరంలో అమలు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. సరి బేసి విధానం కార్లకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. అదే సమయంలో.. వీవీఐపీ.. మహిళలు.. వికలాంగులకు మినహాయింపు ఇస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. కార్లకు అమలు చేస్తున్న నియంత్రణ.. టూవీలర్స్ విషయంలో ఎందుకు పాటించటం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రవ్నించింది.
ఫోర్ వీలర్స్ తో పాటు.. టూ వీలర్స్ విషయంలోనూ ఇలాంటి నియంత్రణే ఎందుకు లేదని ప్రశ్నించిన కోర్టు.. మరో ఆసక్తికర ప్రశ్నను సంధించింది. సరి.. బేసి విధానంలో ఒంటరి మహిళలకు మినహాయింపు ఇవ్వటమేమిటని ప్రశ్నించింది. సరిబేసి విధానంలో మహిళలకు మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించి.. దీనికి సమాధానం చెప్పాలంది. మరి.. హైకోర్టు ప్రశ్నలకు ఢిల్లీలోని కేజ్రీసర్కారు ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.
ఒక్క రోజు వ్యవధిలో ఢిల్లీలో అమలు చేయనున్న సరి బేసి విధానం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. మరి.. ముఖ్యంగా పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి విషయలో దూకుడుగా వ్యవహరించకుండా.. కొత్త విధానం అమలుపై అవగాహన కల్పించాలని.. జరిమానాల మోత మోగించకుండా.. గులాబీ పువ్వులు ఇవ్వాలంటూ సూచన చేశారు. మరి.. ముఖ్యమంత్రి మాటను ఢిల్లీ పోలీసులు చేతల్లో ఎంతగా చేసి చూపిస్తారో చూడాలి.