Begin typing your search above and press return to search.
ఇండియాస్ డాటర్ నిషేధంపై హైకోర్టు..
By: Tupaki Desk | 6 Aug 2016 9:20 AM GMT2012 డిసెంబరు 16.. భారతీయులేవరూ మరిచిపోలేని రోజు - ప్రపంచం మొత్తానికి ఒక దారుణం తెలిసిన రోజు. మహిళలపై ఏ స్థాయిలో అకృత్యాలు జరుగుతున్నాయో, ఆ విషయంలో మానవ మృగాలు ఎంత దారుణంగా ప్రవర్తించాయో బయటి ప్రపంచానికి తెలిసిన రోజు. అదే.. ఢిల్లీ నడిరోడ్డుపై జరిగిన నిర్బయ గ్యాంగ్ రేప్. కచ్చితంగా భారతదేశానికి ఒక పెద్ద మచ్చగా నిలిచిన సంఘటన ఇది!! ఈ అత్యంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నిర్భయ గ్యాంగ్ రేప్ స్టోరీ ఆధారంగా నిర్మించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని నిషేధించాలనే అంశంపై రకరకాల వాదనలు వినబడిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై ఇప్పటికే ట్రయిల్ కోర్టులో విచారణ జరుగుతుండగా.. అదే సమయంలో హైకోర్టులో కూడా ఈ విషయం విచారణలో ఉంది. అయితే ఈ విషయంపై తాజాగా హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఇండియాస్ డాటర్ నిషేధంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ నిషేధంపై జోక్యానికి నిరాకరిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఈ విషయాలపై స్పందించిన హైకోర్టు.. ఇప్పటికే డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో కింద కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండటంతో.. ఈ విషయాలపై అదే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. అయితే నిర్బయ గ్యాంగ్ రేప్ స్టోరీ ఆధారంగా బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ ప్రసారాల అనుమతిపై ఇప్పటికే ట్రయల్ కోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది.