Begin typing your search above and press return to search.
జూహ్లీ చావ్లా చేసిన పనికి హైకోర్టు 20 లక్షల ఫైన్
By: Tupaki Desk | 4 Jun 2021 2:30 PM GMTపాతతరంలో ఊపు ఊపేసిన హీరోయిన్ జూహ్లీ చావ్లా.. ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయిపోయిన ఈ సీనియర్ నటి ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమానిగా కొనసాగుతున్నారు. తాజాగా జూహ్లీచావ్లాకు ఢిల్లీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆమెకు రూ.20 లక్షల జరిమానా విధించింది.
ఇటీవల ఆమె పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన వ్యాఖ్యలు ఈ జరిమానాకు కారణమయ్యాయి. 5జీ నెట్ వర్క్ వల్ల పశుపక్ష్యాదులకు పెద్ద ఎత్తున నష్టం కలుగుతోందని..తక్షణం ఈ 5జీ నెట్ వర్క్ ను నిషేధించాలని ఆదేశాలివ్వాలని ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. 5జీ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుతుందో కనీసం పరిశోధన పత్రాలు, ఆధారాలు కూడా ఆమె సమర్పించలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టు జూహీ చావ్లాపై సీరియస్ అయ్యింది.
పబ్లిసిటీ కోసం పిటీషన్ వేసినట్లుగా ఉందని తక్షణం రూ20లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పి జూహీ చావ్లాకు షాకిచ్చింది. అయితే ఈ పిటీషన్ వేయడమే జూహ్లీ చావ్లాకు ఫైన్ వేయడానికి ఇదే కారణం కాదని తెలిసింది.
ప్రస్తుతం కరోనా తో ఆన్ లైన్ లో కోర్టు సమావేశాలు జరుగుతున్నాయి. పిటీషనర్లకు ఈ ఆన్ లైన్ లింకును పంపుతుంటారు. వారు మాత్రమే ఓపెన్ చేసి చూడాలి. కానీ జూహీ చావ్లా ఆ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరూ నెటిజన్లు ఓపెన్ చేసేసరికి దీంతో కోర్టు ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
న్యాయప్రక్రియను జూహీచావ్లా అవమానించారని ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఆమెపై 20 లక్షల భారీ ఫైన్ విధించింది. ఏదో చేద్దామనుకున్న జూహ్లీ చావ్లా తనకు కనీసం అవగాహన లేకుండా చేసిన పనికి ఇప్పుడు భారీ జరిమానాకు గురైంది.