Begin typing your search above and press return to search.
మగ తోడు ఉంటేనే రండి... మహిళలకు జుమా మసీదు సంచలన ఆదేశం
By: Tupaki Desk | 25 Nov 2022 3:31 AM GMTదేశ రాజధాని ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత జమా మసీదు సంచలన నిర్ణయం తీసుకుంది. మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది. ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్లు వెంట లేకుండా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు జమా మసీద్ మాస్క్ మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు వారి కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలని తెలిపింది. ఈ మేరకు మసీద్ ఎంట్రన్స్ గేట్ల వద్ద నోటీస్ అంటించారు. అంతేకాదు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ముస్లింలకు సందేశం పంపించారు.
ఇక, ఈ విషయంపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో.. జమా మసీద్ కమిటీ నిర్ణయాన్ని మసీద్ పీఆర్వో సబివుల్లా ఖాన్ సమర్థించారు. ప్రార్థనల కోసం వచ్చినవారికి ఇబ్బంది కలిగించేలా సోషల్ మీడియా కోసం మహిళలు వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కుటుంబాలు లేదా దంపతులపై ఎలాంటి నిషేధంలేదని స్పష్టం చేశారు.
మహిళా కమిషన్ సీరియస్..
జుమా మసీదు ఆదేశాలు, తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీలోని కమిషన్ ఫర్ ఉమెన్ స్పందించింది. ఈ అంశంపై జమా మసీద్ పాలనా యంత్రాంగానికి నోటీసు జారీ చేయనున్నామని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు.
ఈ తరహా నిషేధం విధించేందుకు ఎవరికీ హక్కులులేవని తప్పుబట్టారు. మహిళల వెంట పురుషులు ఉండాలనే సిద్ధాంతం ఎవరు తీసుకువస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక, ఇది.. ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.