Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు భారీ షాకిచ్చిన ఢిల్లీ లింకు
By: Tupaki Desk | 31 March 2020 7:50 AM GMTఆదివారం రాత్రి వేళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ గుర్తుందా? ఆ మీడియా సమావేశాన్ని టీవీల్లో చూసిన వారికి కొత్త ధీమా ఏర్పడటమే కాదు.. చూస్తుండగానే కరోనా తోక ముడిచి పారిపోనుందన్న నమ్మకం కలిగింది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల ప్రభావంగా చెప్పాలి. కరోనా పాజిటివ్ కేసులు నయమవుతున్నాయని.. కొత్త కేసులు రావటం తగ్గిందని.. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఏప్రిల్ మొదటి వారానికి తీపికబురు అందుతుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. అయితే.. దీనికి భిన్నమైన పరిస్థితులు తెలంగాణలో చాపకింద నీరులా చేరుతుందన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు. ఇలాంటి పరిస్థితినే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు.
ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. విదేశాల నుంచి వచ్చిన వారు ఎంతమంది? వారిలో ఎంతమందికి హోం క్వారంటైన్ చేశామన్న విషయం మీద ఫోకస్ చేసి..వారందరిని ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా చేయటం.. అనుమానం వచ్చిన వారిని వచ్చినట్లుగా తీసుకెళ్లి ఐసోలేషన్ వార్డులకు పరిమితం చేయటంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా ఫీల్ అయ్యారు. దీనికి తగ్గట్లే.. పాజిటివ్ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల సీఎం ధీమాకు తగ్గట్లే.. ప్రజల్లో నమ్మకం కలిగే పరిస్థితి.
ఇలాంటివేళ.. అనుకోని సమస్య వచ్చి పడింది. ఇప్పటివరకూ విదేశీ ప్రయాణికుల మీదనే ఫోకస్ పెట్టిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. కీలకమైన అంశాన్ని మిస్ కావటం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. తెలంగాణలో తాజాగా ప్రకటిస్తున్న మరణాల్లో అత్యధికం ఢిల్లీలో జరిగిన ఒక మత కార్యక్రమానికి హాజరై వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదు కావటమే కాదు.. వారిలోనే మరణాలు.. పాజిటివ్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండెలు అదిరే ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం చేసింది. దాని ప్రకారం తాజాగా సోమవారం కరోనా కారణంగా ఆరుగురు మరణించినట్లుగా ప్రకటించింది. మరణించిన ఆరుగురిలో నలుగురు ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లుగా తేల్చారు. ఆ నలుగురి నుంచి సోకిన మరో ఇద్దరు మరణించటంతో..సోమవారం ఒక్కరోజే చోటు చేసుకున్న మొత్తం మరణాలు ఆరుకు చేరుకున్నాయి. ఇక కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే అన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. తెలంగాణలో పాజిటివ్ కేసులు 77 కాగా.. ఏపీలో 23కు పెరిగింది.
దీంతో.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారెవరు? అనంతరం వారితో కాంటాక్ట్ అయిన వారెందరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకాలం కరోనా వ్యాప్తి చెయిన్ ను నిలువరించామన్న ధీమాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ఊహించని షాకిచ్చిందని చెప్పాలి. దీంతో.. ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అదే సమయంలో.. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వారికి ఉచితంగా వైద్యం చేస్తామని.. అనవసరమైన సంకోచాలు పెట్టుకోవద్దని చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు 280 మంది వరకూ ఉన్నారని.. వారిలో 186 మంది ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. వాళ్లలో ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. నలుగురు మరణించారు. మరో వ్యక్తి నిజామాబాద్ కాగా.. ఇంకొకరు గద్వాల్ కు చెందినోళ్లు. ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సభలకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఏపీలోని గుంటూరు..నెల్లూరు.. ప్రకారం.. తూర్పు గోదావరి.. విశాఖతో పాటు అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు ఢిల్లీ సభలకు వెళ్లారు. వారిలో పలువురికి ఇప్పటికే కరోనా సోకింది. ఎంతమంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారన్నది ప్రశ్నగా మారింది. వారిని గుర్తించే పనిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బిజీగా ఉన్నాయి. ఇలా.. ఢిల్లీ కనెక్టు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు గుదిబండలా మారిందని చెప్పకతప్పదు.