Begin typing your search above and press return to search.
ఢిల్లీ మద్యం స్కామ్.. కీలక పాత్రంతా శరత్ చంద్రారెడ్డిదే
By: Tupaki Desk | 11 Nov 2022 4:03 AM GMTఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణలో పలువురిని అరెస్టు చేసిన ఈడీ వైఎస్సార్సీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు అయిన శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసిన సంగతిని తెలిసిందే. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
శరత్ చంద్రారెడ్డి.. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకొని అవినీతి మార్గంలో 64 కోట్ల రూపాయలు సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని ఈడీ ఆయనపై అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డితోపాటు పెర్నాడ్ రికార్డు కంపెనీకి చెందిన బినోయ్ బాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి కీలక వ్యక్తి అని ఈడీ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది. ఆయన తన సొంత, బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లను చేజిక్కించుకొని ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఏకంగా 30 శాతాన్ని అదుపులో పెట్టుకున్నారని పేర్కొంది.
ఇప్పటివరకు నిర్వహించిన 169 సోదాల ద్వారా భారీగా డిజిటల్, ఫిజికల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నామని ఈడీ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వానికి జరిగిన రూ.2,631 కోట్ల ఆదాయ నష్టం గురించి కస్టడీలోకి తీసుకుని నిందితులను విచారించాల్సి ఉందని పేర్కొంది.
ఢిల్లీ మద్యం విధానం ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండు రిటైల్ జోన్లకు మించి నియంత్రించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా శరత్‌చంద్రారెడ్డి తన గ్రూప్ అయిన ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, బినామీ సంస్థలైన ఆగ్రానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా 5 రిటైల్ జోన్లను నియంత్రిస్తున్నారని ఈడీ తరఫు న్యాయవాద న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
ఈడీ రిమాండ్ రిపోర్టు ప్రకారం.. శరత్ ఆదేశాల మేరకు పైన పేర్కొన్న మూడు కంపెనీలకు చెందిన కార్యకలాపాలను తాము చూస్తున్నట్లు ఆయన కింద పనిచేసే ఉద్యోగులు కూడా చెప్పారు. తయారీదారులు, టోకు, చిల్లర వ్యాపారులతో కలిపి సౌత్ గ్రూప్ పేరుతో ఏర్పాటైన అతిపెద్ద సిండికేట్‌లో శరత్ చంద్రారెడ్డి ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఈ సిండికేట్‌లో మద్యం తయారీదారు సమీర్ మహేంద్రుతో పాటు దేశంలో అతిపెద్ద మద్యం తయారీ సంస్థ అయిన పెర్నాడ్ రికార్డ్ (పీఆర్‌ఐ) భాగస్వాములుగా ఉన్నాయి.
అదేవిధంగా ఇండో స్పిరిట్స్ అనే సంస్థను పీఆర్‌ఐ తన హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గా నియమించింది. అయితే ఇండోస్పిరిట్స్ సంస్థ సమీర్ మహేంద్రు, అరుణ్‌పిళ్లై, ప్రేమ్ రాహుల్ మండూరిల చేతుల్లో ఉంది. ఇందులో శరత్ చంద్రారెడ్డితో పాటు ఇతర బినామీలకు ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఇండో స్పిరిట్స్‌లో శరత్ చంద్రారెడ్డి కూడా పెట్టుబడులు పెట్టినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.
శరత్ చంద్రారెడ్డి నడుపుతున్న సౌత్‌గ్రూప్ పలు బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్ జోన్లను తన నియంత్రణలో పెట్టుకుంది. తన మూడు కంపెనీల ద్వారా 5 రిటైల్ జోన్లను నడుపుతున్న శరత్... సిండికేట్‌లో సభ్యులుగా ఉన్న ఇతరుల ద్వారా మరో 4 జోన్లను కూడా నిర్వహిస్తున్నారు. ముడుపులు ముట్టచెప్పడం, బినామీ సంస్థలు నడపడం, మద్యం పరిశ్రమలోని వివిధ భాగస్వాములతో కుట్ర పన్నడం లాంటి అవినీతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
అలాగే శరత్ చంద్రారెడ్డి, ఇతరుల ఆధ్వరంలో నడుస్తున్న సౌత్‌గ్రూప్ సిండికేట్ విజయ్‌నాయర్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులు చెల్లించింది. మళ్లీ ఈ చెల్లింపులను పలు రిటైల్ జోన్లు, ఇండోస్పిరిట్స్ ద్వారా ముందుగానే రాబట్టుకున్నారు.
అలాగే ఈ లావాదేవీలు, మద్యం సిండికేట్ సంబంధించిన వివరాలను కూడా శరత్ చంద్రారెడ్డి సర్వర్ల నుంచి తొలగించారని ఈడీ ఆరోపించింది. సర్వర్లను ఉద్యోగులు వేరే చోటకు తరలించినట్టు పేర్కొంది.
అదేవిధంగా ఇండో స్పిరిట్స్ సంస్థ సొంతంగా శరత్ చంద్రారెడ్డి సంస్థలకు అధిక క్రెడిట్ నోట్లు జారీ చేసిందని ఈడీ అభియోగాలు మోపింది. తయారీదారులేమీ ఆ క్రెడిట్‌నోట్స్‌ను ట్రైడెంట్, అవంతిక, ఆగ్రానోమిక్స్‌కి జారీ చేయాలని కోరుతూ ఇండోస్పిరిట్‌కి ఇవ్వలేదు. తయారీదారులు ఇవ్వకపోయినా శరత్ చంద్రారెడ్డి సంస్థలకు క్రెడిట్‌నోట్స్ జారీ చేయడం మోసపూరితమని ఈడీ పేర్కొంది. రూ.4.35 కోట్ల విలువైన క్రెడిట్‌నోట్స్‌ను ఇండో స్పిరిట్ ఈ మూడు సంస్థలకు జారీ చేసిందని వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఉన్న రిటైల్ జోన్లకు అనుచిత లాభాలు/ప్రయోజనాలు బదిలీ చేయడానికే ఇలా చేశారని ఈడీ ఆరోపించింది.
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూ.60 కోట్లు ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆగ్రానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలోని రిటైల్ జోన్లకు సంబంధించిందేనని ఈడీ పేర్కొంది. ఎలాంటి సిండికేట్లు లేకుండా వ్యాపారం చేసే జోన్లతో పోలిస్తే వీటి దగ్గర ఇంత భారీ మొత్తం మిగలడం అక్రమాలకు నిదర్శనమని వెల్లడించింది.
వివిధ వ్యాపారులు, రాజకీయ నాయకులతో కలిసి శరత్ చంద్రారెడ్డి పక్కా ప్రణాళిక, కుట్ర ప్రకారం మోసపూరిత మార్కెట్ విధానాల ద్వారా ఢిల్లీ మద్యం విధానంలో అనుచిత లబ్ధి పొందారని ఈడీ వెల్లడించింది. అవినీతిపనులు, కుట్ర ద్వారా శరత్ చంద్రారెడ్డి రూ.64.35 కోట్ల సొమ్మును కూడగట్టారని వివరించింది.
అంతేకాకుండా మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న 34 మంది వ్యక్తులు సాక్ష్యాలను చెరిపేయడానికి ఇప్పటివరకు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇందులో పెద్ద మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, ఢిల్లీ ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియా, తదితరులు ఉన్నట్టు వివరించింది.
కాగా అరబిందో ఫార్మా హోల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేరు భారీగా పతనమైంది. బీఎస్‌ఈలో బుధవారం ముగింపు ధర రూ.541 కాగా, గురువారం 11.69 శాతం (రూ.63.30) నష్టపోయి రూ.478.10 వద్ద స్థిరపడింది. బుధవారంతో పోల్చితే దాదాపు రూ.3,700 కోట్ల మార్కెట్ విలువను ఈ కంపెనీ కోల్పోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.