Begin typing your search above and press return to search.
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ముఖ్య నేతకు షాక్!
By: Tupaki Desk | 10 Nov 2022 4:57 AM GMTఢిల్లీ మద్యం కుంభకోణం.. అన్ని పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఈ స్కామ్‌కు సంబంధించి ఇటీవల తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిని ఈ కేసులో అరెస్టు చేసింది.
తాజాగా వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి అల్లుడు అయిన రోహిత్ రెడ్డి సోదరుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మూడు రోజులపాటు విచారణ అనంతరం శరత్ చంద్రారెడ్డితో పాటు లిక్కర్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్ ఇండియాకు చెందిన వినయ్ బాబును తాజాగాన నవంబర్ 10న ఉదయం అరెస్టు చేసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన కార్యాలయంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను విచారించి ఇద్దరిని అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.
ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరా తాజాగా అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మరింత మంది పేర్లు తెరపైకి వస్తాయని భావిస్తున్నారు. ఈ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసులో గతంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బోయినపల్లి అభిషేక్ రావు, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రలను అరెస్టు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం ప్రకారం.. ఢిల్లీ మద్యం పాలసీని మార్చడం, మద్యం అమ్మకందారులకు లాభాలను పెంచడం, ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించడం జరిగాయి. మద్యం పాలసీని మార్చడం ద్వారా జరిగిన ఈ కుంభకోణంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే అవినీతి ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని దర్యాప్తు చేయాలని కోరారు. ఇంతలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రద్దు చేసి మళ్లీ పాత పాలసీకి శ్రీకారం చుట్టింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.