Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. వైసీపీ ఎంపీ వింత వ్యాఖ్య‌లు.. ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   19 Sep 2022 7:54 AM GMT
ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. వైసీపీ ఎంపీ వింత వ్యాఖ్య‌లు.. ఏమ‌న్నారంటే
X
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హస్తముందంటూ వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. సోమ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ తండ్రి హయాం నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని.. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే తమ బంధువులు రెండు జోన్లలోనే వ్యాపారం చేశారని వెల్లడించారు.

తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో డైరెక్టర్లుగా లేమని మాగుంట స్పష్టం చేశారు. తన ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసిన ఈడీకి అనుమానాలను నివృత్తి చేశామని మాగుంట పేర్కొన్నారు. తమ దగ్గర నుంచి ఈడీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకువెళ్ళ లేదన్నారు.

మద్యం వ్యాపారం చేసిన అందరి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారన్నారు. ఢిల్లీలో ఉన్న కొంత మంది తన వ్యక్తిత్వంపై కావాలని దాడి చేశారన్నారు. లిక్కర్ స్కామ్‌పై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని మాగుంట తెలిపారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసిన వాళ్లందరూ నష్టపోయారని ఆయన వెల్లడించారు. మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను తాము తప్పు పట్టబోతున్నామన్నారు.

ఢిల్లీ మద్యం స్కామ్ వ్యవహారంలో తమ కుటుంబానికి నష్టం జరిగిందని మాగుంట తెలిపారు. మాకు ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేవు. మా అబ్బాయి రాఘవరెడ్డి 2024 లో ఒంగోలు నుంచి పోటీ చేస్తారని మాగుంట పేర్కొన్నారు.

సందేహాలు ఇవే..

+ ఢిల్లీ లిక్క‌ర్ వ్యాపారంలో త‌న‌కు సంబంధం లేద‌ని చెబుతున్న మాగుంట‌.. ఇంట్లో సీబీఐ, ఈడీ అధికారులు ఎందుకు సోదాలు నిర్వ‌హించారు?
+ ఒక ప్ర‌జాప్ర‌తినిధి ఇంట్లో ఎలాంటి ఆధారం లేకుండా.. ఉన్న‌త‌స్థాయి విచార‌ణ బృందాలు ద‌ర్యాప్తు చేయ‌డాన్ని ఆయ‌న ఎలా స‌మ‌ర్థించుకుంటారు?
+ నిప్పులేందే.. పొగ‌రాద‌న్న‌ట్టు త‌న ప్ర‌మేయం లేకుండా ఈడీ ఇంటికి వ‌స్తే.. న్యాయ స్తానాన్ని ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది క‌దా??
+ పైగా ఢిల్లీ మ‌ద్యం వ్యాపారంతో త‌న‌కు సంబంధం లేదంటూనే.. ఆయ‌న న‌ష్ట‌పోయిన‌ట్టు చెప్పుకొచ్చారు. ఇదే స‌మాధానం.. అంటున్నారు ప‌రిశీల‌కులు.
+ పైగా భ‌విష్య‌త్తులో ఏమైనా జ‌ర‌గొచ్చు.. అంటే.. సంబంధం ఉంద‌నే అనుకోవాలా? ఏదేమైనా.. ఎంపీ మాగుంట త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డ్డార‌నే చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.