Begin typing your search above and press return to search.
బట్టతలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్.. ఢిల్లీ వ్యక్తి ప్రాణం తీసింది
By: Tupaki Desk | 3 Dec 2022 5:29 AM GMTకేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా యవ్వనంగా అందంగా కనిపించాలని నిరంతరం ఒత్తిడికి గురవుతున్నారు. వారు మంచిగా కనిపించకపోతే వారి సామాజిక స్థితిని కోల్పోతారని వారు భయపడుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా చాలా మంది బట్టతల ఉన్న పురుషులు జుట్టు మార్పిడికి వెళుతున్నారు. కానీ ఇది ఇందులో ఎక్స్ పర్ట్స్ చాలా తక్కువ కాబట్టి నైపుణ్యం లేని వారితో బట్టలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకొని ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు.
తాజాగా యూట్యూబ్ లో వీడియోలను చూడటం ద్వారా స్వీయ-శిక్షణ పొందిన ఔత్సాహికులతో నిర్వహించబడిన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ఇటీవల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ అథర్ రషీద్ తన బట్టతలకు జుట్టు మార్పిడి చేయించుకోవాలని ఒక అనుభవం లేని క్లినిక్ ను సంప్రదించాడు. ఈ ఘోరమైన తప్పుతో ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబంలో అతనే ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాడు. ఇతడి మరణంతో అతడి కుటుంబం రోడ్డున పడింది.
మీడియాలో కనిపించాలంటే అందంగా ఉండాలి. ఇక పెళ్లి కావాలంటే బట్టతల వేధిస్తోంది. ఈ రెండింటికి పరిష్కారం వెతుక్కోవాలని అథర్ రషీద్ భావించాడు. అందంగా తయారై పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అతను గత సంవత్సరం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ని చేసుకున్నాడు. ఆ తర్వాత, అతను పలు సార్లు ఈ చికిత్స కోసం వచ్చాడు. అయితే అతని తల నుండి వాపు ఎక్కువవడం ప్రారంభించింది. ఆ తర్వాత అతనికి భయంకరమైన నొప్పి వచ్చింది.
ఇది సైడ్ ఎఫెక్ట్ అయ్యి అతని మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయాయి. ఆ తర్వాత అతని అవయవాలన్నీ ఒక్కొక్కటిగా ఫెయిల్ అయ్యాయి.. కృంగి కృశించి మరణించాడని అతడి తల్లి తెలిపింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శస్త్రచికిత్స చేసిన నలుగురిని అరెస్టు చేశారు. వారి విచారిస్తున్నారు.
ఒక ప్రొఫెషనల్ సర్జన్ చేత నిర్వహించబడినప్పుడు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రమాదకరం కాదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే.. జీవితాన్ని మార్చే అనుభవంగా ఉంటుంది. ఈ సర్జరీకి దాదాపు మూడున్నర లక్షలు ఖర్చవుతుండగా మధ్యతరగతి పురుషులకు ఖర్చు ఎక్కువ అని ఇలా చిన్న క్లినిక్ లు ఆశ్రయిస్తున్నారు. చాలా మంది శిక్షణ లేని సిబ్బందిచే నిర్వహించబడే చిన్న క్లినిక్‌లు పైన పేర్కొన్న ఖర్చులో సగానికే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో చాలా లోకల్ అనస్థీషియా ఉంటుంది. నైపుణ్యం లేని ,శిక్షణ లేని కొందరు ఈ విధానాన్ని నిర్వహించినట్లయితే ప్రాణాలు పోవడం ఖాయం. వారికి తగినంత జ్ఞానం లేదు, అప్పుడు ఇది అసురక్షిత ప్రక్రియగా మారుతుంది. ఇలా ప్రాణాలు తీస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.