Begin typing your search above and press return to search.
మోడీని తిడతావా అని కొట్టాడు
By: Tupaki Desk | 19 Dec 2016 7:22 AM GMTపెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోప్రజల్లో పెరిగిపోతున్న అసహనం, తద్వారా ఎదురవుతున్న విపరిణమాలకు ఇదో నిదర్శనం. నోట్ల కోసం క్యూ లైన్లో నిల్చున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించాడని సదరు అసహనం తెలిపిన వ్యక్తి మరో వ్యక్తి తల పగల కొట్టేశాడు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఏటీఎం క్యూలో నిల్చున్న 45 ఏళ్ల లాలన్ సింగ్ అనే వ్యక్తి నోట్ల రద్దు పరిణామాలపై తన అసహనం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోడీని విమర్శించాడు. దీంతో ఆ వెనకాలే ఉన్న ఆషిక్ అనే వ్యక్తికి కాలిపోయింది.
లాలన్ సింగ్ తో ఈ విషయంలో ఆషిక్ వాదన పెట్టుకున్నాడు. అలా ముదిరిపోయిన వివాదంలో ఆషిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రికెట్ స్టంప్స్ తో సింగ్ పై మూడు సార్లు బాదాడు. దీంతో సింగ్ కు తీవ్రంగా రక్తస్రావం అయి స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించగా కోలుకుంటున్నాడు.
మరోవైపు బ్యాంకు ఉద్యోగులు సైతం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురవుతున్న పరిణామాలపై తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇలా మనోవేదనకు గురైన ఓ బ్యాంక్ క్యాషియర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుజరాత్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో థారట్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ప్రేమ్ శంకర్ ప్రజాపతి అనే వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రజాప్రతి పని ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సతీమణి ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దిరోజులుగా తన భర్త ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా, ఎప్పుడూ బాధపడుతూ ఉండిపోయారని, తాజాగా ఇలా జరిగిందని ఆవే కన్నీరు మున్నీరైంది. కాగా ఈ బలవన్మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/