Begin typing your search above and press return to search.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు: బహిష్కరించిన ఆ గ్రామం.. కారణం ఇదీ
By: Tupaki Desk | 5 Dec 2022 2:30 AM GMT15 ఏళ్లుగా అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో తాము అన్యాయం అయ్యామంటూ ఆ గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బహిష్కరించారు. ఉత్తర ఢిల్లీలోని ప్రశాంత గ్రామ నివాసితులు ఆదివారం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బహిష్కరించారు. ఇంతకాలం ఢిల్లీ పౌరసంఘాన్ని బీజేపీ నిర్వహిస్తోంది.
పౌర సంస్థను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఎంసీడీలో విలీనం చేయడానికి ముందు ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన కాటేవారా అనే గ్రామం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని నివాసితులు అంటున్నారు.
పోలింగ్ బూత్‌లకు ఒక్కరూ వెళ్లి ఓటేయలేదు. దీంతో చాలా వరకు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఓటింగ్ రోజున ఇది ఒక విచిత్రమైన దృశ్యం అని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో ఓటరు ఒక్కరు కూడా హాజరు కాలేదు.
తమకు సరైన రోడ్లు, డ్రెయిన్లు వంటి కనీస సౌకర్యాలు లేవని కాటేవార వాసులు ఆరోపించారు. అందుకే ఢిల్లీ మున్సిపల్ లో తమ ఫిర్యాదులను వినే వరకు తాము ఓటు వేయబోమని తేల్చిచెప్పారు.
ఎంసీడీ ఏకీకరణకు ముందు నిధుల కొరత కారణంగా పురపాలక సంఘం ఈ గ్రామాన్ని పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. దీంతో సారి ఓట్లు వేయకపోవడంతో అందరూ తీవ్ర ఒత్తిడికి లోనైంది.
ఢిల్లీలోని ఇతర ప్రాంతాలలో శీతాకాలపు పొగమంచును తట్టుకుని ఓటు వేయడానికి వెళ్ళిన చాలా మంది ప్రజలు చెత్త సేకరణ , పరిశుభ్రమైన పరిసరాలు వంటి వాటిని నేరుగా తాకే సమస్యలను పరిష్కరించలేదంటూ ఇలానే నిరసన తెలుపడం గమనార్హం.