Begin typing your search above and press return to search.
ఢిల్లీలో కారు పార్కింగ్ ఫీజు అక్షరాల రూ.వెయ్యి
By: Tupaki Desk | 17 Oct 2019 7:44 AM GMTసంచలనం కోసమో.. వైరల్ కోసమో ఈ విషయాన్ని చెప్పటం లేదు. సరైన ప్రణాళిక.. ముందుచూపు లేని చోట ప్రజల జీవనం ఎంత నరకంగా మారుతుందన్న విషయాన్ని చెప్పేందుకు చక్కటి ఉదాహరణగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా.. ఆయన ఆరోగ్యానికి ఎంత నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని లెక్కలు వేసి మరీ చెప్పటాన్ని మర్చిపోలేం.
అంతటి కాలుష్య రక్కసిలో ఉండే ఢిల్లీ మహానగరంలో తాజాగా తీసుకున్న నిర్ణయం తెలిస్తే.. కారు యజమానులు అవాక్కు అవ్వాల్సిందే. వాహన కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. పార్కింగ్ ఛార్జిలనుభారీగా పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్ లో కారు పార్కింగ్ ఫీజును రూ.వెయ్యికు పెంచాలని ఢిల్లీ అధికారుల కమిటీ నిర్ణయించింది.
ఇప్పటికే ఢిల్లీలో 33 లక్షల కార్లు ఉంటే.. 7.3 కోట్ల టూవీలర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రోజుకు తక్కువలో తక్కువ 500 కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. ఇంత భారీగా కార్లు రోడ్ల మీదకు రావటంతో వాయుకాలుష్యం పెరిగిపోవటమే కాదు.. రోడ్లు మొత్తం కిక్కిరిసిపోతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఛార్జీల్ని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా కన్నాట్ ప్లేస్ లో అత్యధికంగా రూ.వెయ్యిగా నిర్ణయించారు. మరి.. ఇంత భారీ ఛార్జిని అమలు చేసి.. వసూలు చేసే వేళలో ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.