Begin typing your search above and press return to search.

త‌బ్లిగ్ స‌భ్యుల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన వారిపై కేసు న‌మోదు

By:  Tupaki Desk   |   14 April 2020 10:10 AM GMT
త‌బ్లిగ్ స‌భ్యుల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన వారిపై కేసు న‌మోదు
X
భార‌త‌దేశంలో కొన్ని రోజులైతే క‌రోనా వైర‌స్ పూర్తిగా త‌ర‌లిపోతుంద‌ని భావిస్తున్న స‌మ‌యంలో జమాత్ మర్కజ్ ఘ‌ట‌న‌ తో ఒక్క‌ సారిగా దేశంలో ప‌రిస్థితులు మారిపోయాయి. దేశం మొత్తం క‌లిపి వెయ్యిలోపు క‌రోనా కేసులు వెలుగులోకి రాగా ప్ర‌స్తుతం ఆ జ‌మాత్ మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌తో ఏకంగా ప‌ది వేల‌కు పైగా కరోనా కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. వారి వ‌ల‌న ఇంకా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆ ఢిల్లీ కార్య‌క్ర‌మానికి వెళ్లి వ‌చ్చిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. వారు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన అనంత‌రం అధికారుల‌కు స‌మాచారం ఇచ్చి క్వారంటైన్‌ లో ఉండేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.

అక్కడికి వెళ్లొచ్చిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఆస్ప‌త్రుల‌కు రావాలి, లేదా అధికారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నా వారు ముందుకు రావ‌డం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ వివ‌రాలు సేక‌రించి అలాంటి వారిని గుర్తించి వెంట‌నే క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఈ క్ర‌మంలో జమాత్‌ కు వెళ్లొచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన 11 మందిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

దీంతో తబ్లీగ్ జమాత్ తెలంగాణ ఇన్‌ చార్జ్ ఇక్రమ్ అలీతో పాటు మరో 10 మందిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మార్చి నెలలో జమాత్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి తెలంగాణ తబ్లీగ్ జమాత్ అధ్యక్షుడు ఇక్రమ్ అలీ ఆశ్రయం కల్పించారు. అత‌డు ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించారు. ఆ స‌భ్యుల‌ను ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చి స‌హ‌క‌రించాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చినా ఆయ‌న వాటిని ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఆశ్ర‌యం క‌ల్పించ‌డంతో అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఆశ్రయం పొందిన వారందరికీ ఈ సంద‌ర్భంగా అధికారులు కరోనా ప‌రీక్ష‌లు చేశారు. ఇక్రమ్‌ తో సహా పలువుర్ని క్వారంటైన్‌కు తరలించారు. ప్ర‌స్తుతం వారి ప‌రీక్ష‌ల ఫ‌లితం వెల్ల‌డి కావాల్సి ఉంది. వారికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌స్తే మాత్రం తెలంగాణ‌లో మ‌రిన్ని క‌రోనా కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంది. ఈ క్ర‌మంలో ఆశ్రయం ఇచ్చిన 11 మంది పై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌ లోని 188 - 269 - 270 సెక్షన్‌ల కింద హబీబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.