Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ కు షాకిచ్చిన ఢిల్లీ అసెంబ్లీ

By:  Tupaki Desk   |   13 Sep 2020 12:30 PM GMT
ఫేస్ బుక్ కు షాకిచ్చిన ఢిల్లీ అసెంబ్లీ
X
బీజేపీకి అనుకూలంగా దేశంలో ఫేస్ బుక్ వ్యవహరిస్తోందని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ ఇదే ఆరోపణలతో ఫేస్ బుక్ ఇండియా అధిపతికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత కంటెంట్ ను తొలగించడంలో విఫలమైందనే ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీజేపీ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకర పోస్టులను ఫేస్ బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే ఈ సమన్లు జారీ చేశారు.

సెప్టెంబర్ 15న ఢిల్లీ విధాన సభలో విచారణకు హాజరు కావాలని భారత్ లో ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడు , మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ కు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సమన్లను పంపించింది. నలుగురు ప్రామినెంట్ జర్నలిస్టులు.. డిజిటల్రైట్స్ యాక్టివిస్టులు సహా పలువురు నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఫేస్ బుక్ ఈ నోటీసులు జారీ చేసినట్లు ప్రకటన జారీ చేశారు.

దేశంలో ఓ వర్గానికి ఫేస్ బుక్ కొమ్ముకాస్తోందని.. వ్యాపార ప్రయోజనాల కోసం వ్యతిరేక వ్యాఖ్యలను తీసివేయడం లేదని గతంలో ఆరోపణలు వచ్చాయి. గత వారం భారత పార్లమెంట్ కమిటీ కూడా అజిత్ మోహన్ ను విచారించింది.

అయితే ఫేస్ బుక్ మాత్రం ఆరోపణలు ఖండించింది. ద్వేషపూరిత కంటెంట్ ను మరింతగా అరికట్టాల్సి ఉందని అభిప్రాయపడింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో మత కలహాల సందర్భంగా ఫేస్ బుక్ విద్వేష ప్రసంగాలను పూర్తిగా వదిలేసిందని విచారణ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఇలా సమన్లు జారీ చేసింది.