Begin typing your search above and press return to search.

మోడీ స‌భ‌ల్లో చోరీ.. దొంగ‌ల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!

By:  Tupaki Desk   |   20 July 2018 5:39 AM GMT
మోడీ స‌భ‌ల్లో చోరీ.. దొంగ‌ల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!
X
ఢిల్లీ పోలీసులు ఒక దొంగ‌ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దొంగ‌ల ముఠాను ప‌ట్టుకోవ‌టం కూడా ఒక వార్తేనా? అని ఫీలైతే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. వారు ప‌ట్టుకున్న‌ది మామూలు దొంగ‌ల ముఠా కాదు. ముద‌ర్ల‌కే.. దేశ ముదుర్లు లాంటి దొంగ‌ల జ‌ట్టు ఇది.

వీరు టార్గెట్ చేసే స‌భ‌లు.. స‌మావేశాలు.. ఈవెంట్లు తెలిస్తే షాక్ తినాల్సిందే. అన్నింటికి మించి వీరు చోరీలు చేసేందుకు విమానాల్లో వ‌చ్చి మ‌రీ త‌మ ప‌ని పూర్తి చేసుకొని ఎంచ‌క్కా ఎగిరిపోవ‌టం వీరికి అల‌వాటు. అంతేనా ఫ్లైట్ల‌లో జ‌ర్నీ చేసే ఛాన్స్ లేదంటే.. ఏసీ ఫ‌స్ట్ క్లాస్ లో వీరు జ‌ర్నీ చేసి మ‌రీ చోరీలు చేస్తుంటారు. ఇంట్లో వారికి బిజినెస్ టూర్ అని చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చే వీరు టార్గెట్ చేస్తే విష‌యం భారీగా ఉంటుంద‌ని చెబుతారు.

ఇక‌.. వీరి చోరీల వ్య‌వ‌హారం చూస్తే.. నోట మాట రాదంతే. ప్ర‌ధాని మోడీ పాల్గొనే ర్యాలీలు.. పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌.. ముంబ‌యిలో జ‌స్టిన్ బీబ‌ర్ కాన్స‌ర్ట్.. గ్రేట‌ర్ నోయిడాలో ఆటో ఎక్స్ పో లాంటి మెగా ఈవెంట్ల‌లోనే చోరీ చేస్తారు. ఆరుగురితో ఉండే ఈ టీం దొంగ‌త‌నాలు భారీగా ఉంటాయట‌. ఢిల్లీకి చెందిన గ్యాంగ్ లీడ‌ర్ 38 ఏళ్ల అస్లాం ఖాన్ నాయ‌క‌త్వంలో ఈ టీం ప‌ని చేస్తుంద‌ట‌. ఒక వ్య‌క్తి అందించిన స‌మాచారంతో ఈ గ్యాంగ్‌ను ప‌ట్టుకున్న పోలీసుల‌కు.. వారిని విచారించే క్ర‌మంలో షాకుల మీద షాకులు త‌గిలి నోట మాట రాలేద‌ట‌.

ఈ ముఠా ద‌గ్గ‌ర నుంచి 46 హైఎండ్ స్మార్ట్ ఫోన్లు.. ఒక తుపాకీ.. తూటాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద పెద్ద స‌భ‌లు..ఖ‌రీదైన ఈవెంట్ల‌లో పాల్గొని చోరీలు చేసే ఈ ముఠా ఇప్ప‌టివ‌ర‌కూ 5వేల స్మార్ట్ ఫోన్లు చోరీ చేసిన‌ట్లుగా తేల్చారు. అంతేకాదు.. దొంగ‌త‌నాల్ని ఒక ఉద్యోగంగా మార్చేసిన ఘ‌న‌త గ్యాంగ్ లీడ‌ర్ అస్లాందే. ఎందుకంటే.. త‌న ద‌గ్గ‌రున్న ఐదుగురు దొంగ‌ల‌కు నెల‌కు రూ.40వేల చొప్పున జీతం ఇస్తాన‌ని చెప్ప‌టంతో పోలీసుల నోట మాట రాని ప‌రిస్థితి. తాము చోరీ చేసిన స్మార్ట్ ఫోన్ల‌ను మొబైల్ రిపేర్లు.. మొబైల్ షాపుల్లో విక్ర‌యిస్తామ‌ని వెల్ల‌డించాడు.

వ్యాపారం మాదిరి చోరీలు చేయించే అస్లాం అస‌లు వృత్తి గురించి ఇంట్లో భార్య ద‌గ్గ‌ర నుంచి పిల్ల‌ల వ‌ర‌కూ తెలీకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం మ‌రో ఆస‌క్తిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.