Begin typing your search above and press return to search.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై పోలీసులు చార్జీషీట్..
By: Tupaki Desk | 13 Aug 2018 11:33 AM GMTఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కింద పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులే సీఎం కేజ్రీవాల్ పై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 19న ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ పై కేజ్రీవాల్ అధికార నివాసంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.. ఈ దాడి సమయంలో కేజ్రీవాలే అక్కడే ఉన్నాడు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా - 11మంది ఆప్ ఎమ్మెల్యేలు.. సీఎస్ అన్షుపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనతో ఢిల్లీ ప్రజాప్రతినిధులు - ఐఏఎస్ అధికారులు చీలిపోయారు. పెద్ద వివాదం చెలరేగింది. అప్పటి నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు - అధికారులకు జరుగుతున్న వివాదం తొలి చార్జీషీట్ తో ముదిరి పాకాన పడింది.
ఈ ఘటనకు సంబంధించి తాజాగా సీఎం కేజ్రీవాల్ - డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా - 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు సోమవారం తీస్ హజారీ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. మరో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు కూడా చీఫ్ సెక్రెటరీని కొట్టారనే అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇప్పటికే వీరందరినీ పోలీసులు విచారించారు. దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమనతుల్లాఖాన్ - ప్రకాష్ జర్వాల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.