Begin typing your search above and press return to search.

వైరల్: ఢిల్లీ మత ప్రార్థనలపై సంచలన వీడియో

By:  Tupaki Desk   |   1 April 2020 10:30 AM GMT
వైరల్: ఢిల్లీ మత ప్రార్థనలపై సంచలన వీడియో
X
దేశంలో నెమ్మదిగా ఉన్న కరోనా వైరస్ ను ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలు కుదుపు కుదిపాయి. అందులో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో ఇప్పుడు తీగ లాగితే బోలెడంత మంది కరోనా రోగులు బయటపడుతున్నారు. చాలా మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో రాష్ట్రాలన్నీ అలెర్ట్ అయ్యాయి.

ఢిల్లీలోని మార్కజ్ భవనంలో మత ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రాల్లోని స్వస్థలాలకు వచ్చిన వారందరినీ ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. అయితే మత ప్రార్థనలు నిర్వహించరాదని ఢిల్లీ పోలీసులు ముందే హెచ్చరించారు.ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అయినా మత పెద్దలు పెడచెవిన పెట్టారు. నిజాముద్దీన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ వలియాన్ మత పెద్దలను స్టేషన్ కు పిలిపించి మరీ వారితో మాట్లాడారు. కరోనా కారణంగా మత ప్రార్థనలు నిర్వహించరాదని.. భవనాన్ని ఖాళీ చేయాలని కోరారు. అయితే 1000 మందితో సమావేశం నిర్వహిస్తామని చెప్పి వేలమందిని ఆహ్వానించారని పోలీసులు తెలిపారు. దాని ఫలితంగానే కరోనా వైరస్ వేలాది మందికి సోకిందని తెలిపారు. ఇందులో కుట్రకోణం ఉందని.. దేశంలో కరోనా వ్యాపింపచేసే ఆలోచన ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మర్కజ్ మత ప్రార్థనల వెనుక కుట్ర కోణం ఉందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకే వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సామూహిక ప్రార్థనలకు పిలుపునిచ్చారని విమర్శించారు. ఈ ఘటనకు గల అన్ని కారణాలను వెలికి తీయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. ఈ ప్రార్థనలపై కేంద్ర హోంశాఖ కూడా దర్యాప్తునకు ఆదేశించింది.