Begin typing your search above and press return to search.
జగన్ పార్టీ ఎంపీలను బలవంతంగా ఆసుపత్రికి
By: Tupaki Desk | 11 April 2018 9:43 AM GMTప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. గడిచిన ఆరు రోజులుగా ఆమరణ నిరాహారధీక్ష చేస్తున్న ఎంపీల ఆరోగ్యం అంతకంతకూ విషమిస్తున్న నేపథ్యంలో.. వైద్యుల సూచనతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఆసుపత్రికి తరలింపునకు యువ ఎంపీలు ఇద్దరూ నిరాకరించారు. అయినప్పటికీ.. బలప్రయోగంతో వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎంపీలకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అందుకు ఎంపీలు నిరాకరించారు. తాము దీక్ష చేస్తామని వారు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో ఉన్న పార్టీ నేతలు.. మీడియాను వైద్యులు బయటకు పంపారు. లోపల ఏం జరుగుతుందన్న దానిపై స్పష్టత రావటం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆసుపత్రిలోని సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఎంపీలు మిథున్.. అవినాష్ లు ఉన్నారు. ఆరు రోజుల దీక్ష కారణంగా ఆరోగ్యం దెబ్బ తిందని.. మరింత సేపు దీక్ష సాగితే వారికి ఇబ్బందని.. ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలని ఎంపీలకు వైద్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.