Begin typing your search above and press return to search.

రైతు సంఘం నేతలకు ఢిల్లీ పోలీసుల షాక్

By:  Tupaki Desk   |   28 Jan 2021 2:27 PM GMT
రైతు సంఘం నేతలకు ఢిల్లీ పోలీసుల షాక్
X
గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ఢిల్లీలో తీవ్ర హింసకు పాల్పడిన రైతు సంఘం నేతలకు పోలీసులు షాకిచ్చారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. తాజాగా వారికి లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేయడం విశేషం.

ఎఫ్ఐఆర్ నమోదు కాబడిన రైతు నేతలు తమ పాస్ పోర్టులు స్వాధీనం చేయాలని పోలీసులు అల్టీమేటం జారీ చేశారు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్రహోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.సమీక్ష సమావేశం అనంతరం నిందితులైన రైతు నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు.

ఇక నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి లుక్ అవుట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన హింసలో మొత్తం 25 ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. ఇందులో 40మంది రైతు సంఘాల నాయకులలో 30మందికి పైగా కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపినవారున్నారు.ఎర్రకోటపై దాడి కేసులో పంజాబ్ సినీ నటుడు డీప్ సిద్ధూ, గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నేత మాల్వా యాత్ , లఖ్ బీర్సింగ్ లపై కూడా ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు.