Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో మంటపెట్టిన మునవార్ కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
By: Tupaki Desk | 27 Aug 2022 11:30 AM GMTహైదరాబాద్ అల్లకల్లోలానికి అసలు కారణం ప్రముఖ స్టాండప్ కమెడియన్ 'మునావర్ షో' నే. ఇతడి షోకు మంత్రి కేటీఆర్ సపోర్ట్ చేయడం.. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించడం.. ఆ తర్వాత మాటల మంటలతో హైదరాబాద్ తగలబడిపోయింది. దీనంతటికి కారణం మునావర్ షో హైదరాబాద్ లో జరగడమేనంటున్నారు. అంతటి ఉద్రిక్తతలకు కారణమైన మునావర్ కు ఢిల్లీ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. షోకు అనుమతిస్తే మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే షోకు అనుమతి ఇస్తే అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 28న జరగాల్సిన మునావర్ ఫరూఖీ షో రద్దు అయ్యే అవకాశం ఏర్పడింది.
ఇదే నెలలో బెంగళూరు పోలీసులు కూడా ఇదే విధంగా మునావర్ షోకు అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్ లో మాత్రమే ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ ఈ షోను నిర్వహించారు.
గతంలో మునావర్ ఫరూఖీ హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేయడంతో అప్పటి నుంచి ఆయన ప్రదర్శనలు శాంతిభద్రతల సమస్యలుగా మారాయి. పలు హిందూ సంస్థలతోపాటు బీజేపీ కూడా మునావర్ ఫరూఖీ ప్రదర్శనలను వ్యతిరేకిస్తోంది.
మునావర్ షో తర్వాత రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది. బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది. హైదరాబాద్ లో ఇంతటి ఉద్రిక్తతలకు కారణమైన మునావర్ షోకు ఢిల్లీ పోలీసులు అందుకే అనుమతి రద్దు చేశారు.