Begin typing your search above and press return to search.
ఢిల్లీ అల్లర్ల కేసు.. ఇద్దరు నిర్మాతలకు నోటీసులు
By: Tupaki Desk | 14 Sep 2020 6:06 PM GMTగతేడాది డిసెంబరులో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు చెలరేగిన హింసకు సంబంధించి దిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిర్మాతలకు సమన్లు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధం ఉన్నాయన్న ఆరోపణలతో డ్యాక్యుమెంటరీ నిర్మాతలు రాహుల్ రాయ్, సబా దేవన్‌లు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నిర్మాతలిద్దరు అల్లర్లకు మద్దతు తెలిపే ఓ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నట్లు పోలీసు లు వెల్లడించారు. వాట్సఫ్ గ్రూప్ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాల పంపినట్లు గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించి జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌ను అరెస్టు చేసిన మరుసటి రోజునే వీరికి సమన్లు జారీ చేయడం గమనార్హం. ఢిల్లీ ఘర్షణలకు కొందరు నేతలు, ప్రొఫెసర్లు కారణమని ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్లు వార్తలు రావడంతో దుమారం రేగింది. వీరిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, ఆర్థిక వేత్త జయతీ ఘోష్, ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ అపూర్వానంద్‌ల పేర్లు ఉన్నట్టు మీడియాలో ముమ్మర ప్రచారం జరిగింది. కానీ పోలీసులు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఫిబ్రవరిలో దిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలు కాగా.. అవి తర్వాత తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘర్షణల్లో 50 మందికి పైగా చనిపోయారు. వందల మంది క్షతగాత్రులుగా మిగిలారు. భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.