Begin typing your search above and press return to search.
ఢిల్లీ కాలుష్యం ఉగ్రవాదులపనా?
By: Tupaki Desk | 8 Nov 2016 2:45 AM GMTగతకొన్ని రోజులుగా ఢిల్లీలో దుమ్ము, దూళి కి తోడు పొగమంచు కూడా తోడవడంతో అక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తూనే ఉంది. ఈ స్థాయిలో ఢిల్లీలో కాలుష్యం ఆకాశ వీధులను కప్పేసేలా విజృంభిస్తోన్న సంగతీ తెలిసిందే. బయటకు వస్తే చాలు, ఒక గంటపాటు ఢిల్లీ లో తిరిగితే చాలు వారికి స్వాసకోస వ్యాదులు, జ్వరలూ కన్ఫాం అనే స్థాయిలో పరిస్థితి ఉంది. తాజాగా కళ్లు పాడైపోతాయన్న భయంతో రంజీ క్రికెట్ మ్యాచ్ రద్దయ్యింది.. స్కూళ్లు మూతపడుతున్నాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఢిల్లీలో కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. అయితే తాజాగా ఈ విషయాలపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ఢిల్లీ కాలుష్యం కూడా ఉగ్రవాదమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో వాతావరణం రోజు రోజుకీ మరింతగా క్షీణించిపోతోందని, దీనిని ఇప్పుడే అడ్డుకోవాలంటే దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్న అనుపమ్ ఖేర్... అసలు ఈ కాలుష్యానికి కారణమైన మూల కారణాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని అంటున్న అనుపమ్... అది ఒకెత్తైతే ఈ ఢిల్లీ కాలుష్యం మరో రకమైన ఉగ్రవాదమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఈయన... ఢిల్లీ కాలుష్యం వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని, ఇది కొత్త రూపంలో ఉన్న ఉగ్రవాదమని అంటున్నారు.
కాగా, కశ్మీర్ లోయలో పాఠశాలలను తగులబెట్టిన విషయంపై మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లలు బడికెళ్లి చదువుకోవడం ఇష్టం లేని వాళ్లు, వారిని నిరక్షరాస్యులుగా మార్చి వారి చేతిలో తుపాకి పెట్టి ఉగ్రవాదులుగా మార్చాలనుకునేవాళ్లే ఇలాంటి చర్యలకు పూనుకుంటారని అన్నారు. ఈ సందర్భంలోనే ఢిల్లీ కాలుష్యం గురించి అనుపమ్ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.