Begin typing your search above and press return to search.
ఈ దొంగ ఊరోళ్లందరికీ దేవుడు
By: Tupaki Desk | 18 July 2017 5:43 AM GMTబాగా డబ్బున్న పెద్దోళ్లను దోచుకొని పేదలకు పంచిపెట్టే రాబిన్‌హుడ్ కథ మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. బీహార్ కు చెందిన 27 సంవత్సరాల ఇర్ఫాన్ రాబిన్ హుడ్ వారసుడు అని చెప్పొచ్చు. ఢిల్లీలో సంపన్నుల ఇళ్లల్లో దోపిడీలు చేసి బీహార్ లోని సొంత ఊరిలో సామాజిక కార్యకర్తగా చలామణి అవుతూ పేదలకు అన్నదానాలు చేస్తుంటాడు. కనీసం ఎనిమిది పెళ్లిళ్లకు భోజనాలు పెట్టించాడని చెప్తారు. ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తాడు. అలా ఊరి వారందరికీ దేవుడిగా మారాడు. పనిలోపనిగా కొంత సొమ్మును తన కోసం అట్టిపెట్టుకొని జల్సా చేసేస్తుంటాడు.
గ్రామస్థులకు ఉజాలాబాబు పేరుతో ఇర్ఫాన్ పరిచితుడు. అతడు దోపిడీ దొంగ అంటే వారు నమ్మలేకపోతున్నారు. 5వ తరగతిలో చదువు మానేసిన ఇర్ఫాన్ ఢిల్లీలో జరిగిన 12 దోపిడీ కేసుల్లో అరెస్టయ్యాడు. బీహార్ లోని పుప్రీ జిల్లాలోని సొంతఊరిలో ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు వారంతా షాక్ కు గురయ్యారట. ఈ అరెస్టు సమయంలో అతని చేతికి ఢిల్లీ న్యూఫ్రెండ్స్ కాలనీలో దొంగిలించిన రోలెక్స్ వాచీ ఉంది అంటే మనోడి రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ - ముంబైలలో బార్ లలో జల్సాలు చేసే అలవాటు కూడా ఇర్ఫాన్ కు ఉందట. ఓ పాట వినేందుకు బార్ మేనేజర్ కు ఓసారి పదివేలు చెల్లించాడట. ఊరోళ్లకే కాదు.. భోజ్‌పురి సినిమాల్లో నటించే గర్ల్ ఫ్రెండ్ కూ అసలు స్వరూపాన్ని వెల్లడించలేదని అంటున్నారు. కాగా, చోరీచేసిన వాచీలు - నగలు స్థానిక వర్తకుడు ధర్మేందర్ కు అమ్మి హోండాసివిక్ కారు కొన్నాడు. ఆయనకు సహకరించినన ధర్మేందర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.