Begin typing your search above and press return to search.
ఒడిశాలో కరోనా కేసు వెలుగు చూస్తే..ఢిల్లీకి దడ ఎందుకంటే?
By: Tupaki Desk | 17 March 2020 1:30 PM GMTతెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే. నిప్పును ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అందుకు ఫలితం అనుభవించటమే కాదు.. మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కరోనా వైరస్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. ఎవరికి వారు తమ దారిన తాము బతుకుతున్నా.. చెప్పాపెట్టకుండా సింఫుల్ గా మనిషి శరీరంలోకి ఎక్కేస్తుంది. కాస్త కుదురుకున్నాక.. తాను ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మీద దాడి చేసి.. తాను చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా సోకిన విషయం తెలీని పరిస్థితుల్లో కొందరు తమ పనులు తాము చూసుకుంటూ పోతారు. కానీ.. వారి పుణ్యమా అని.. వారికి కూడా తెలీకుండా వారి చుట్టుపక్కల వారిలోకి నిశ్శబ్దంగా ఎక్కేస్తుంది కరోనా. అందుకే కరోనా ఎవరికైనా పాజిటివ్ అన్న విషయం తేలినంతనే.. సదరు వ్యక్తి అంతకు ముందు ఏయే ప్రాంతాల్లో తిరిగారు.. ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు? వారి పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు వచ్చేస్తున్న పరిస్థితి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే రాగా.. ఒడిశాలో సోమవారం తొలి కేసు నమోదైంది. ఆ వెంటనే అక్కడి రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసు ఉదంతం విన్నంతనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో బండరాయి పడిన పరిస్థితి. ఎందుకంటే.. ఒడిశా పాజిటివ్ కేసు అంతకు ముందు ఢిల్లీ నుంచి రావటమే కారణంగా చెబుతున్నారు.
ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి మార్చి ఆరున ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి రైల్లో ఈ నెల 12న భువనేశ్వర్ కు చేరుకున్నారు. తాజాగా సదరు వ్యక్తికి కరనా వైరస్ పాజిటివ్ అన్న విషయం తేలటంతో.. ఇప్పుడు అందరూ అప్రమత్తం అయ్యారు. ఆ వ్యక్తి ప్రయాణించిన రైలు తో పాటు.. ఢిల్లీలోని మెట్రో రైల్లోనూ ప్రయాణించారు. ఇప్పుడు అతనికి కాంటాక్ట్ అయిన వారెందరు? వారి పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
ఇప్పటికే ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గించే పనిలో బిజీగా ఉన్న ప్రభుత్వానికి తాజాగా వెలుగు చూసిన భువనేశ్వర్ ఎపిసోడ్ కొత్త సవాల్ విసురుతోంది. ఇప్పటివరకూ సదరు వ్యక్తి కారణంగా కాంటాక్ట్ అయిన వారు 120 మందిని గుర్తించారు. వారందరికి కరోనా పరీక్ష్లు జరుపుతున్నారు. వారి నుంచి వచ్చే టెస్టు రిజల్ట్.. ఢిల్లీ ఫ్యూచర్ ను కొంతమేర ప్రభావితం చేయటం ఖాయమంటున్నారు. ఈ కారణంతోనే భువనేశ్వర్ లో కరోనా పాజిటివ్ కేసు ప్రకటన వచ్చినంతనే.. ఢిల్లీ సర్కారుకు తమ పక్కన బాంబు పేడినట్లుగా ఉలిక్కిపడుతున్నారు.