Begin typing your search above and press return to search.

రాజధాని నుండి రామ మందిరంకు బుల్లెట్‌ స్పీడ్‌..!

By:  Tupaki Desk   |   23 Aug 2021 1:30 PM GMT
రాజధాని నుండి రామ మందిరంకు బుల్లెట్‌ స్పీడ్‌..!
X
అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత చ‌రిత్ర కలిగిన ఆల‌యంగా దీని నిర్మాణం సాగుతోంది. ఎందుకంటే ప్ర‌పంచంలోనే అధిక హిందూ జ‌నాభా క‌లిగిన దేశ‌మైన మ‌న ఇండియాలో రాముడికి ఉన్న ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. జై శ్రీరామ్ నినాదం ఎంత‌లా ప్ర‌భావం చూపుతుందో అంద‌రికీ తెలిసిందే. మొద‌టి నుంచి ఈ గుడి నిర్మాణం ఎంత‌లా వివాదాలు సృష్టించిందో కూడా చూస్తూనే ఉన్నాం. ఎప్ప‌టి నుంచో ఈ ఆల‌య నిర్మాణం పెండింగ్‌లో ఉండ‌గా.. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దీని నిర్మాణానికి అడుగులు ప‌డ్డాయి. అయితే ఒక్క సారే అనుమ‌తులు కూడా రాలేదు. ఎన్నో సంవ‌త్స‌రాలు సుప్రీంకోర్టులో దీనిపై విచార‌ణ‌లు జ‌రిగిన త‌ర్వాత చివ‌ర‌కు కోర్టు తీర్పు మేర‌కు దీని నిర్మాణానికి పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ఇక పార్ల‌మెట్ ఆమోదించిన త‌ర్వాత యూపీలోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంతో వేగంగా నిర్మాణ ప‌నులు సాగుతున్నాయి. ఇక దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ రామ మందిర నిర్మాణాన్ని 2023 వ‌ర‌కు పూర్తిచేయాల‌ని ట్ర‌స్ట్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. కాగా ఇప్ప‌టికే అయోధ్య‌లో ప‌నులు వేగంగా జ‌రుగుతున్న క్ర‌మంలో మ‌ర్యాద పురుషోత్త‌మ శ్రీరామ‌చంద్ర ఎయిర్‌పోర్టుకు మ‌రోప్రాజెక్టును తీసుకు రావ‌డానికి ట్రై చేస్తోంది. ఈ ఎయిర్ పోర్టుకు స‌మీపంలోనే కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేష‌న్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ స్టేష‌న్ ను నిర్మించ‌బోతున్నారు. కాగా ఇక్క‌డి నుంచి నేరుగా ఢిల్లీకి ఈ బుల్లెట్ ట్రైన్ ను న‌డిపేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.

ఇక ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కూడా నేష‌న‌ల్ హైస్పీడ్ రైల్ కార్పోరేష‌న్‌కు అప్ప‌గించారని స‌మాచారం. ఇక ఈ సంస్థ మేనేజ్ మెంట్ రీసెంట్ గా ఆయోధ్య‌కు వెళ్లి మ‌రీ ఎయిర్ పోర్టుకు స‌మీపంలో స్థ‌లాన్ని కూడా ప‌రిశీలించి ప్ర‌భుత్వంతో అన్ని ర‌కాలుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేష‌న్ కోసం యూపీ గ‌వ‌ర్న‌మెంట్ కూడా ఆల‌స్యం చేయ‌కుండా అనుమ‌తులు కూడా జారీ చేసింది. ఇక ఎయిర్ పోర్ట్ స‌మీపంలో నిర్మిస్తున్న స్టేష‌న్ కాబ‌ట్టి అక్క‌డి నుంచి కూడా నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ రావాల్సి ఉన్న‌ద‌ని తెలుస్తోంది. ఇక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ బుల్లెట్ ట్రైన్ ఢిల్లీ నుంచి వార‌ణాసి అలాగే ప్ర‌యాగ మీదుగా అయోధ్య‌ను చేరు్కుంటుంద‌ని తెలుస్తోంది.

మొత్తంగా 941.5 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఈ ట్రైన్ గంట‌కు 350 కిలోమీట‌ర్ల స్పీడ్‌తో న‌డుస్తుందంట‌. ఒకే రాష్ట్రంలో రెండు ముఖ్య‌మైన ఆల‌యాలు ఉండ‌టంతో బీజేపీ ప్ర‌భుత్వం ఈ విధంగా బుల్లెట్ ట్రైన్లు న‌డిపేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక ఇప్ప‌టికే ఇందుకోసం ప‌క్కా ప్ర‌ణాళిక‌లు కూడా ర‌చిస్తోంది. బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చిన ఘ‌న‌త కూడా బీజేపీ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. రానున్న రెండేళ్ల‌లో క‌చ్చితంగా దాన్ని పూర్తి చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది.