Begin typing your search above and press return to search.

ఢిల్లీ హింస: మురికికాల్వల్లో శవాల గుట్ట

By:  Tupaki Desk   |   28 Feb 2020 4:48 AM GMT
ఢిల్లీ హింస: మురికికాల్వల్లో శవాల గుట్ట
X
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసలు దారుణాలు వెలుగుచూస్తున్నాయి. చంపేసి మురికి కాలువల్లో శవాలను పడేసిన తీరు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. అంతేకాదు.. అంకిత్ శర్మ అనే ఐబీ ఆఫీసర్ ను ఏకంగా ఆరుగంటల పాటు శరీరంలోని అన్ని అవయవాలపై 400 కత్తిపోట్లు పొడిచి పేగులు బయటకు తీసి నరకం చూపించి చంపారని వైద్యుల పోస్టుమార్టంలో తేలడం ఈ హింస ఎంత దారుణంగా జరిగిందో ఊహించడానికే భయం వేస్తోంది. ఈ పరస్పర దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటివరకే 38మంది చనిపోగా వందలాది మంది గల్లంతయ్యారు.

చాలా మంది మృతదేహాలు మురికికాలువల్లో దొరికాయి. ఇక తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఘర్షణలు కాస్తా తగ్గుముఖం పట్టినా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. పూర్తిగా అదుపులోకి రాలేదు.

ఈ అల్లర్లలో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. 144 సెక్షన్ విధించారు. ఈ అల్లర్లకు బాధ్యులుగా 130మందిని అరెస్ట్ చేశారు. మరో 400మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కాన్సిలర్ తాహీర్ హుస్సేన్ అనుచరుడిపై కేసు నమోదైంది. ఈ కేసులను సిట్ కు అప్పగించారు. అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. బాంబ్ లాంచర్లు - హ్యాండ్ గ్రెనేడ్లు అల్లర్ల ప్రాంతంలో దొరకడంతో ఇదంతా పక్కా ప్లాన్ తోనే చేశారన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. రాత్రికి రాత్రి చేసిన ప్లాన్ ఇది కాదని పోలీసులు తేల్చారు.

చనిపోయిన బాధితులకు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులకు రూ.10లక్షలు ఇస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పునరావాసం, రోడ్లు, ఆలయాలు, మసీదులను మరమ్మతు చేస్తున్నారు.