Begin typing your search above and press return to search.

ఢిల్లీ సగం ఖాళీ కాబోతుంది .. ఎందుకంటే

By:  Tupaki Desk   |   4 Nov 2019 5:13 AM GMT
ఢిల్లీ సగం ఖాళీ కాబోతుంది .. ఎందుకంటే
X
ఢిల్లీ కాలుష్యం గత కొన్నిరోజులుగా అంతకంతకు పెరిగిపోతుంది. దీపావళి ముందు వరకు ఒక రకంగా ఉన్న కాలుష్యం , పండుగ తర్వాత ఒక్కసారిగా అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గురువారం రాత్రి నుంచి నమోదైన కాలుష్యం స్థాయిలు మరింత దిగజారి తొలిసారిగా వెయ్యి పాయింట్లు దాటాయి. దీంతో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాఠశాలలకు సెలవులను కూడా ప్రకటించారు.

దీనితో ఈ సమయంలో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో నివాసం ఉంటున్న ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర నగరాలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 40శాతం మంది ప్రజలు తమ నివాసాలను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు తాజాగా ఓ సర్వే తేల్చింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న కాలంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాలని 16శాతం ప్రజలు అనుకుంటున్నట్లు తేలింది.

సుమారుగా 17వేల మందికిపైగా ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే చేయగా .. కాలుష్యం వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమకు ఈ ప్రాంతంను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేదని స్పష్టంచేశారు. దాదాపు 40శాతానికిపైగా ప్రజలు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ను వదిలి ఇతర నగరాలకు వెళ్లాలని నిర్ణయించుకోగా.. 31శాతం మంది ప్రజలు మాత్రం ఈ ప్రాంతంలోనే ఉంటూ ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, మాస్కులు వాడుకుంటామని తెలిపారు. ఈ మేరకు విషయాలు లోకల్ సర్కిల్స్ అనే సర్వేలో తేలింది.

వాయు కాలుష్యం విషపూరితంగా మారిన సమయాల్లో మాత్రం వేరే ప్రాంతాలకు వెళ్లి.. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటామని 16శాతం మంది ప్రజలు చెప్పారు. మరో 13శాతం మంది మాత్రం తమకు ఇక్కడ ఉండటం తప్ప మరో మార్గం లేదని తెలిపారు. కాలుష్యం ఉన్నప్పటికీ తాము ఇక్కడే ఉంటామన్నారు. ఆదివారం ఉదయం వర్షం పడటంతో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. దీనితో ఢిల్లీ ఊటీ ని తలపించింది. అలాగే విమానాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైయ్యాయి.