Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు.. అమ్మాయితో బట్టలు విప్పించింది

By:  Tupaki Desk   |   15 Nov 2016 7:22 AM GMT
నోట్ల రద్దు.. అమ్మాయితో బట్టలు విప్పించింది
X
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్యూ లైన్లలో గంటలు గంటలు నిలబడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ కారణంగా ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చాలా చోట్ల గొడవలు.. అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఢిల్లీలో జరిగిన తాజా పరిణామం మరో ఎత్తు. క్యూ లైన్లో నిలబడి తీవ్ర అసహనానికి గురైన ఓ అమ్మాయి.. ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది.. ఆమె తన ఒంటిపై ఉన్న టాప్ తీసేసి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. క్యూలైన్లో ఉన్న మహిళలు వచ్చి ఆమెకు అడ్డంగా నిలబడే ప్రయత్నం చేసినా.. ఆమె అరుస్తూ నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది.

దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది. వాళ్లు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. బ్యాంకు సిబ్బంది వెంటనే స్పందించి ఆ యువతికి డబ్బులిచ్చి పంపించారు. ఓ అమ్మాయి ఫ్రస్టేషన్ ఈ స్థాయికి చేరేలా విసిగించారా అని బ్యాంకు అధికారులపై విమర్శలు వస్తుండగా.. వాళ్లేమో ఈ యువతి విషయంలో కొత్త పాట అందుకున్నారు. ఆమె అమ్మాయి కాదని.. హిజ్రా అని అన్నారు. ఐతే ఢిల్లీలో అమ్మాయిలు ఇలా అర్ధనగ్నంగా రోడ్ల మీద హల్ చల్ చేయడం మామూలే కాబట్టి.. నిజంగా ఓ అమ్మాయే ఇలా చేసిందని అంటున్నారు. ఏదేమైనా.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జనాల్లో తాత్కాలికంగా అయినా చాలా ఇబ్బంది పడుతూ.. తీవ్ర అసహనానికి గురవుతున్న మాట మాత్రం వాస్తవం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/