Begin typing your search above and press return to search.

ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం.. తొలి కేసు నమోదు !

By:  Tupaki Desk   |   25 Jun 2021 10:38 AM GMT
ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం.. తొలి కేసు నమోదు !
X
ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఏపీ లో మొదటి డెల్టా ప్లస్‌ కేసు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొన్ని రోజుల ముందు తిరుపతిలో డెల్టా ప్లస్‌ కేసు నమోదైందని తెలిపారు. అయితే డెల్టా ప్లస్‌ సోకిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అని, అయితే ఆ బాధితుడి నుంచి ఇతరులెవరికీ వ్యాపించలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

బ్లాక్‌ ఫంగస్‌, డెల్టా ప్లస్‌ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒకవేల థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. లాక్ డౌన్ సడలింపులపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.