Begin typing your search above and press return to search.
సౌరవ్ గంగూలీకి డెల్టా ప్లస్ వేరియంట్ పాజిటివ్
By: Tupaki Desk | 2 Jan 2022 7:21 AM GMTకరోనా రూపాలు మార్చుకుంటూ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదటి వేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్న భారతదేశం రెండో వేవ్ కు కుదేలైంది. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ‘ఒమిక్రాన్’ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే పాత డెల్టా ప్లస్ కేసులు కూడా దేశంలో విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి..
టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రెండు డోసుల కరోనా టీకా వేసుకున్నా కూడా ఆయనకు మళ్లీ కరోనా వైరస్ సోకడం ఆందోళనకు కారణమైంది. తాజాగా గంగూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్వహించిన పరీక్షల్లో గంగూలీకి సోకింది డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలింది.
గత వారం కరోనా బారిన పడిన గంగూలీ కోల్ కతాలోని వుడ్ లాండ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగెటివ్ వచ్చింది. దీంతో గంగూలీ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలోనే గంగూలీని డిశ్చార్జి చేసినట్లు సమాచారం.
అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో గంగూలీకి డెల్టా ప్లస్ పాజిటివ్ గా గుర్తించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఇంట్లోనే ఐసోలేషన్ల ో ఉండాలని సూచించామన్నారు.