Begin typing your search above and press return to search.
ఇప్పుడు వంద నోటే కింగ్ గురూ!
By: Tupaki Desk | 9 Nov 2016 3:58 AM GMTఇంతకాలం బ్యాంకు కెళితే... "సార్ కాస్త పెద్ద నోట్లుంటే ఇవ్వరా" అని మాట చాలా మంది ఉపయోగించేవారు, మరి కొందరు కనీసం వినిన అనుభవం అయినా కలిగి ఉంటారు. కాస్త పెద్దమొత్తంలో నగదు డ్రా చేసుకునేవారంతా కచ్చితంగా ఈ మాట అనేవారు. "తీసుకెళ్లేందుకు సులభంగా ఉంటుంది... పెద్ద నోట్లు ఇవ్వండి... వందలు వద్దు సార్" వంటి మాటలు చెప్పటం, వినటం బ్యాంకుల్లో చాలా సహజం. కానీ కాలం మారింది... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయంతో ఇప్పుడు మాత్రం వందనోటుదే పెత్తనమంతా!
ప్రస్తుతం జేబులో రూ.500 ఉన్న వ్యక్తికన్నా.. వందనోటు ఉన్నోడే హీరో! కొత్త నోటు వచ్చే వరకు రూ.100 జేబులో ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే... ప్రధాని ప్రకటన అనంతరం ఏటీఎంల దగ్గర జనాలు క్యూలు కట్టారు. ఈ క్యూల్లో ఉన్నవారిలో కొందరు వందనోట్ల కోసం వస్తే, మరికొందరు తమ దగ్గరున్న పెద్దనోట్లను క్యాష్ డిపాజిట్ మిషన్ల (సీడీఎం) ద్వారా అకౌంట్లో వేసేందుకు గంటలు తరబడి లైన్లో నిలుచున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ఏటీఎంలన్నీ కిటకిటలాడాయి. ఈ స్థాయిలో జనాలు ఏటీఎం లపై ఎగబడేసరికి చాలా చోట్ల సెక్యూరిటీ గార్డులు ఏటీఎంల షటర్లు దించేశారు. ఇదే క్రమంలో పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఇవే పొడవైన లైన్లు కనిపించాయి! పెద్ద నోటు ఇవ్వడం, వందరూపాయల పెట్రోల్ పోయించుకోవడం. ఈ రేంజ్ లో వందనోటు ప్రస్తుతం కింగై కూర్చుంది!! నిన్నటివరకూ ఏ నోటునైతే వద్దు అని రిక్వస్ట్ చేసి మరీ పెద్ద నోటులు తీసుకున్నారో వారికి ప్రస్తుతం వందే డాన్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/