Begin typing your search above and press return to search.
బెంగళూరులో హోటల్ రూం ధర రూ.40వేలు
By: Tupaki Desk | 9 Sep 2022 4:48 AM GMTకష్టంలో ఉంటే తోటి మనిషి సాయం అందిస్తారని అనుకుంటాం. కానీ.. కష్టంలో ఉన్నంతనే డిమాండ్ - సప్లై సూత్రం వెంటనే అమల్లోకి వస్తుంది. డిమాండ్ పెరిగే కొద్దీ సప్లై తగ్గటం.. దాని కారణంగా ధరలు పెరిగే చందంగానే.. బెంగళూరులో ప్రస్తుత పరిస్థితి ఉందని చెబుతున్నారు.
బెంగళూరులో కురిసిన భారీ వర్షం.. గార్డెన్ సిటీని ఎంతలా దెబ్బేసిందన్న సంగతి తెలిసిందే. ఐటీ హబ్ మునిగిపోవటంతోపాటు.. కోట్లాది రూపాయిలు విలువ చేసే ఖరీదైన విల్లాల్లోకి సైతం వర్షపు నీరు పోటెత్తటంతో.. వారంతా బయటకు వచ్చేయటం తెలిసిందే.
కోట్లకు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన విల్లాలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరినట్లుగా చేరిపోవటంతో.. ఇళ్లను వదిలేసి.. ట్రాక్టర్లు.. జేసీబీల్లో బయటపడటం తెలిసిందే. ఇలాంటి వారిలో పలు కంపెనీలు సీఈవోలతో పాటు.. కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు పలువురు ఉండటం షాకింగ్ గా మారింది. భారీ వర్షాల కారణంగా ఇళ్లల్లో ఉండటానికి ఇష్టపడని పలువురు ఖరీదైన హోటళ్లకు పోటెత్తటం షురూ చేశారు. దీంతో.. బెంగళూరులోని హోటల్ గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
దీనికితోడు బెంగళూరులోని పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని ఎల్ బీ శాస్త్రినగర్ లో చాలా అపార్టుమెంట్లకునీటి సరఫరాతో పాటు విద్యుత్ కూడా నిలిచిపోవటంతో వీలైనతవరకు హోటళ్లలో ఉండేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో హోటల్ రూం ధరలు భారీగా పెరిగిపోయాయి.
సాధారణంగా ఒక రోజుకు రూ.10వేలు ఉండే హోటల్ ధరలు ఇప్పుడు ఏకంగా రూ.40వేలకు చేరుకోవటం గమనార్హం. కొన్ని చోట్ల అయితే ఒక రాత్రికి రూ.30 నుంచి రూ.40వేల వరకు చార్జ్ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. వరదలకు దెబ్బ తిన్న వైట్ ఫీల్డ్.. అవుటర్ రింగ్ రోడ్డు.. ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డు..కోరమంగళ తదితర ప్రాంతాల్లోని అనేక హోటల్ గదులన్ని బుక్ అయిపోయినట్లుగా చెబుతున్నారు.
ఓల్డ్ ఎయిర్ పోర్డు రోడ్డులోని లీలా ప్యాలెస్ లో ప్రస్తుతం ఒక రూం ప్రారంభ ధర రూ.18,113 ఉండగా.. తాజ్ బెంగళూరులో డీలక్స్ గది స్టార్టింగ్ ధర రూ.14,750గా ఉంది.అయితే.. ఓయో రూంలు చౌకగా లభిస్తున్నాయి. ఇవి రోజుకు రూ.2వేల నుంచే అందుబాటులోకి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. సంపన్నులు ఖరీదైన హోటళ్లలో ఉండేందుకే అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.