Begin typing your search above and press return to search.
జగనన్న బాండ్లకు భలే గిరాకీ!
By: Tupaki Desk | 14 Jun 2022 5:30 AM GMTమద్యం అమ్మకాలపై వస్తున్న ఆదాయమే కీలకంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని, మద్యనిషేధం మాట అటుంచితే వీలున్నంత వరకూ మద్యం అమ్మకాలతోనే సర్కారు బండి నడుస్తోంది అని ఇప్పటికే నిర్థారణ అయిన నిజం.
ఇదే పరిశీలకుల మాట కూడా ! బాగుంది ఇప్పటిదాకా ఏ రంగానికి రానంత ఆదాయం కానీ క్రేజ్ కానీ ఒక్క ఆబ్కారీ శాఖకే వస్తోంది. ఒక్క లిక్కర్ డీల్స్ కే వస్తోంది అన్నది కూడా నిర్థారణలో ఉన్న నిజం. సాధారణ స్థాయిలో ఉన్న ఆదాయాలకు అసాధారణ స్థాయిలో ఉన్న ఆదాయాలకూ మధ్య తేడా ఏంటన్నది ఈ ప్రభుత్వం వచ్చాకే, సంబంధిత పాలసీలు తెచ్చాకే తేలిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక రంగానికి మద్యం అమ్మకాలతో తప్ప వేగంగా నాలుగు రూపాయలు చేరుకునే దారే లేకపోవడం విషాదం అని సామాజిక వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇంతవరకూ సంపద సృష్టి అంతా ఈ రంగం నుంచే జరగడం ఓ రాష్ట్ర ప్రగతికి, ముఖ్యంగా ప్రజారోగ్యానికి అంత మంచిది కాదు అన్నది వారి అభిప్రాయం.
తాజాగా మద్యం కు సంబంధించి రాబోయే ఆదాయాలను దృష్టిలో ఉంచుకుని లిక్కర్ బాండ్లను వేలానికి ఉంచారు జగన్ సర్కారు ప్రతినిధులు. ఇవి ఇప్పుడు మార్కెట్లో భలే క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వీటిని దక్కించుకునేందుకు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సైతం పోటీ పడుతున్నారు అని తెలుస్తోంది.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సహా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కూడా ఈ బాండ్ల వేలంలో పాల్గొని, వీటిని సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయని సమాచారం.
రూ.5,080 కోట్లతో ఈ బాండ్లను సొంతం చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ చూపిస్తున్న అత్యుత్సాహం ఒకింత ఆశ్చర్యకరమే! ఓ కేంద్ర ప్రభుత్వం ఇంతటి స్థాయిలో బాండ్ల వేలంపై దృష్టి పెట్టిందంటే రానున్న కాలంలో సమకూరనున్న మద్యం ఆదాయంపై వారికి ఏ పాటి స్పష్టత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.