Begin typing your search above and press return to search.

వేతనాల వెతలు...వాలంటీర్ల ధర్నా

By:  Tupaki Desk   |   10 Oct 2022 3:24 PM GMT
వేతనాల వెతలు...వాలంటీర్ల ధర్నా
X
ఏంటో పనిచేయడానికి లేదు ఒక వైపు. చేసిన వారికి జీతాలు వేతనాలు లేని పరిస్థితి మరో వైపు. ఏపీలో ఇపుడు ఎక్కడ చూసినా ఈ రకమైన బాధలతో ఆందోళనలు చేసేవారు ఎక్కువ అయ్యారు. తాజాగా బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏ వద్ద మాతృ భాషా విద్యా వాలంటీర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదు అని వాపోయారు.

తమకు 2021-22 విద్యా సంవత్సవరంలో ఈ వేతనాలు రావాల్సి ఉందని అంటున్నారు. అప్పట్లో అయిదు నెలల పాటు పాఠశాలలో విద్యా బోధన అందించేందుకు వాలంటీర్లుగా పనిచేశామని చెబుతున్నారు. అయితే నెలలు ఏళ్ళూ గడచినా నేటికి కూడా ఒక్క పైసా కూడా వేతనాల రూపంలో రాకపోవడం దారుణమని వారు అంటున్నారు.

తమకు చెల్లించాల్సిన చిన్న మొత్తాలను కూడా ఇవ్వకపోతే ఎలా అని వారు నిగ్గదీస్తున్నారు. తమ ఆర్ధిక బాధలను ప్రభుత్వం ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ఎన్నో సార్లు విన్నపాలు చేసుకున్న మీదట కూడా కనీస స్పందన లేకపోవడం వల్లనే తాము ఆందోళనా పధంలోకి వచ్చామని చెబుతున్నారు.

తమకు న్యాయం జరిగేంతవరకూ రిలే నిరాహార దీక్షను కొనసాగించి తీరుతామని వారు స్పష్టం చేస్తున్నారు. మరి అందరికీ అన్ని విధాలుగా సాయం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏ పని చేయకుండానే ఊరకనే బటన్ నొక్కగానే నగదు వారి బ్యాంకులలో జమ చేస్తున్న ప్రభుత్వం కష్టపడి పనిచేసిన వారి వేతన బకాయిలను చెల్లించకపోవడం న్యాయం కాదనే అంతా అంటున్నారు. విద్యా వాలంటీర్లుగా పనిచేసిన వారు ఇలా రోడ్డున పడడం మంచిది కాదని వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.