Begin typing your search above and press return to search.
ఏపీ జిల్లాలపై తెలంగాణ నుంచి డిమాండ్...!
By: Tupaki Desk | 28 Jan 2022 10:43 AM GMTఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న జగన్ సర్కార్ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ భిన్నాభిప్రాయాలు బయట వారి నుంచి, సామాన్య జనాల నుంచి మాత్రమే కాకుండా.. సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కొన్ని జిల్లాల విషయంలో తన నిర్ణయం మార్చుకోకపోతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని వైసీపీ వాళ్లు నేరుగా జగన్‌కే హెచ్చరికలు పంపుతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తున్నామని..ఉగాది నుంచి ఈ కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుందని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలు జిల్లాల్లో పార్టీల నాయకులు, ప్రజలు, మేథావుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని జిల్లాల్లో చారిత్రక నేపథ్యం పోతోందని.. మరి కొన్ని చోట్ల అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాలను వదిలేసి.. కొత్త ప్రాంతాలతో ఎందుకు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి అభ్యంతరాలు రావడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు ఏపీ జిల్లాల విషయంలో కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చారు. కర్నూలు జిల్లాకు అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య బాగా పనిచేశారని.. ఆయన సేవలకు గుర్తుగా అయినా కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని వీహెచ్ కోరారు.
కడపకు వైఎస్సార్ పేరు, విజయవాడకు ఎన్టీఆర్, మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన జగన్‌కు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న ఆలోచన రాకపోవడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. జగన్ దీనిపై వెంటనే పునరాలోచన చేయాలని... స్థానికంగా ఉన్న నేతలు సైతం ఈ విషయంలో జగన్‌పై ఒత్తిడి తీసుకు రావాలని ఆయన కోరారు.