Begin typing your search above and press return to search.
హలీంకు హైదరాబాద్‌లో ఎంత డిమాండో తేలింది
By: Tupaki Desk | 15 Jun 2018 6:11 AM GMTనలుగురు కలిసినంతనే ఛాయ్ తాగుదాం భయ్ అన్న మాట హైదరాబాద్ లోని ప్రతి గల్లీలోనూ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్థానే సరికొత్త మాట వినిపిస్తోంది. ఛాయ్ సంవత్సరంలో ఎప్పుడైనా ఉండేదే. ఏడాదిలో రంజాన్ సీజన్లో మాత్రమే లభించే హలీంకు హైదరాబాదీయులు సలాం కొడుతున్న వైనం ఇప్పుడు ఎక్కవైంది.
ఈ ఏడాదిలో హలీంపై హైదరాబాదీయుల్లో క్రేజ్ భారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 7500 హలీం బట్టీలు ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హలీంను తినేందుకు తెల్లవారు జాము నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత వరకూ తినేందుకు మక్కువను ప్రదర్శించటం.
హలీంకు హైదరాబాద్‌లో ఎంత క్రేజ్ ఉందన్న విషయం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. కొత్త రుచులకు పెద్దపీట వేసే హైదరాబాదీయులు హలీంను ఎంజాయ్ చేస్తున్నారని.. ఈ ఏడాది కొత్త ట్రెండ్ ఏమిటంటే.. టైంతో సంబంధం లేకుండా తినేస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తెల్లవారుజామున.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా తినే వారు ఎక్కువైనట్లుగా తేలింది.
ఇరాన్ నుంచి దిగుమతి అయిన హలీం వంటకం రంజాన్ స్పెషల్ గా హైదరాబాద్‌లో అందిస్తున్నారు. 1956లో తొలిసారిగా వండి వార్చిన ఈ వంటకం గత ఏడాది 450 కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తే.. ఈసారి అంతకు మించిన స్థాయిలో వ్యాపారం జరిగిందని చెబుతున్నారు. హలీంను కొందరు ఆన్ లైన్లో ఆర్డర్లు ఇచ్చే వారు ఉదయం 7 గంటలకే ఆర్డర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆన్ లైన్లో అధికంగా ఆర్డర్లు ఇచ్చే వారిలో ఐటీ ఉద్యోగులు.. సంపన్న వర్గాల ప్రాంతాల్లోనివాసం ఉండేవారిగా స్విగ్గి నివేదికలో తేలింది. ఆన్ లైన్ ఆర్డర్లలో 80 శాతం మేర హలీం ఉన్నట్లు తేలింది. గతంతో పోలిస్తే.. ఈసారి హలీం క్రేజ్ భారీగా పెరిగిందని చెబుతున్నారు.