Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీ విజయం..ఆయన డిమాండ్ పెరిగిపోయింది!
By: Tupaki Desk | 14 Jun 2019 5:21 PM GMTఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయం ప్రశాంత్ కిషోర్ డిమాండ్ ను అనేక రెట్లు పెంచింది. ఐదేళ్ల కిందట పీకే పేరు ఎంతగా మార్మోగిపోయిందో - ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ఆయన పేరు మార్మోగుతోంది. ఆయనకు పార్టీ లనుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతూ ఉంది.
గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్ట్రాటజిస్టుగా పని చేశారు ప్రశాంత్ కిషోర్. మోడీ - అమిత్ షాల నాయకత్వంలో వారికి తన టీమ్ తో సహకారం అందించారు పీకే. హిందీ బెల్ట్ లో భారతీయ జనతా పార్టీ అప్పుడు సాధించిన సంచలన విజయంలో పీకే వ్యూహాలకు కూడా భాగస్వామ్యం ఉందని విశ్లేషకులు తేల్చారు. దీంతో పీకే పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది.
ఆ తర్వాత పీకే తో వివిధ రాజకీయ పార్టీలు ఒప్పందాలు చేసుకుంటూ వచ్చాయి. బీజేపీ వాళ్లేమో ఆ తర్వాత పీకేని పట్టించుకోలేదు కానీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తో జేడీయూ నేత నితీశ్ కుమార్ ఒప్పందం చేసుకున్నారు. అక్కడ అప్పుడు జేడీయూ - ఆర్జేడీలు కలిసి పోటీ చేశాయి. విజయం సాధించాయి. దీంతో పీకే కి మరింత పేరు వచ్చింది.
ఆ తర్వాత యూపీలో అఖిలేష్ యాదవ్ కోసం పీకే పని చేసినప్పటికీ అక్కడ అంతగా ఆయన ప్లాన్లు వర్కవుట్ కాలేదు. అయినా ఆయన సహకారాన్ని తీసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. వ్యూహాలు పన్నడం, అమలులో సహకారం కోరుతూ ఐప్యాక్ తో జగన్ ఒప్పందం కుదర్చుకున్నారు. ఎన్నికలకు రెండేళ్లకు ముందు నుంచినే పీకే టీమ్ తో జగన్ ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు.
ఆ వ్యూహాలు ఎంత వరకూ వర్కవుట్ అయ్యాయో ఎవరికీ తెలియదు కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది మాత్రం నిజం. అది కూడా జగన్ పార్టీ ఏపీ లో స్వీప్ చేసింది. దీంతో పీకే బ్రాండ్ వ్యాల్యూ చాలా వరకూ పెరిగింది.
దీంతో అనేక పార్టీలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాయట. అధికారంలో ఉన్న పార్టీలు అధికారాన్ని నిలుపుకోవడానికి, అధికారంలో లేని పార్టీలు దాన్ని సాధించుకునేందుకు పీకేతో ఒప్పందం చేసుకునేందుకు ఉబలాపడుతూ ఉన్నాయి.
ఇప్పటికే టీఎంసీ నేత మమతా బెనర్జీ కి పీకే సలహాదారుగా నియామకం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక అన్నాడీఎంకే వాళ్లు కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారట. మరోవైపు పీకేతో ఒప్పందం కోసం చంద్రబాబు కూడా ప్రయత్నాలు చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే టీడీపీ వాటిని ఖండించింది. ఏదేమైనా పీకేకు ఫుల్ డిమాండ్ అయితే ఉందని స్పష్టం అవుతోంది.