Begin typing your search above and press return to search.
మాకూ కావాలి ఓ జిల్లా
By: Tupaki Desk | 7 Oct 2016 5:30 PM GMTరాజకీయ నేతలంటే ప్రజల నుంచి ఓట్లు.. పార్టీ నుంచి పదవులు కోరుకుంటారు. ఇంకా కాంట్రాక్టులు - కమీషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందరినీ ఒకే గాటన కట్టేయకపోయినా ఎక్కువమంది కోరికలు మాత్రం ఇవే. ఇంకా నియోజకవర్గాల అభివృద్ధిపై అంతోఇంతో చిత్తశుద్ధి ఉన్నవారైతే తమ నియోజకవర్గాలు, జిల్లాల్లో పనులు చేయించడానికి ప్రభుత్వం నుంచి నిధులు కోరుతుంటారు.. అభివృద్ధి పనుల మంజూరు కోరుతుంటారు. అందుకోసం డిమాండు చేస్తుంటారు. కానీ... తెలంగాణలో మాత్రం ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరు నేతల కోరికా ఒకటే.. మాకో కొత్త జిల్లా కావాలి అంటున్నారు అంతా.
కొత్త జిల్లాలు ఖరారై - జిల్లా కేంద్రాల ఏర్పాటు కోసం ఏర్పాట్లు పూర్తి అవుతుండగా, మరోవైపు మరిన్ని కొత్త జిల్లాల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. 31 జిల్లాలకు మించి పరిశీలించేది లేదు - మంత్రులెవరూ మరిన్ని డిమాండ్ల గురించి మాట్లాడవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన తరువాత కూడా పలువురు మంత్రులు కొత్త జిల్లాల డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నారు. కెసిఆర్ హఠాత్తుగా సిరిసిల్ల - జనగామ - గద్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఆసిఫాబాద్ జిల్లాకు సైతం ఆమోదం తెలపడంతో అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. ప్రతి నియోజక వర్గం నుంచి జిల్లా కావాలి అనే ఒత్తిడి ఎమ్మెల్యేలు - మంత్రులపై పెరుగుతోంది. దీంతో వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ లో హుజూరాబాద్ ను జిల్లా చేయాలని కోరుతూ హుజూరాబాద్ అఖిలపక్ష నేతలు - హుజురాబాద్ జిల్లా సాధన కమిటీ నేతలు హైపవర్ కమిటీ చైర్మన్ కేశవరావును కలిశారు. వరంగల్ లో అయితే కొత్త జిల్లాల డిమాండ్లు చిచ్చు రేపుతున్నాయి. ములుగుని జిల్లా చేయాలని కొందరు.. గిరిజన ప్రాంతాలతో గిరిజన జిల్లా ఏర్పాటుకు ఇంకొందరు డిమాండు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గతంలో సమ్మక్క సారక్క జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి చందూలాల్ గుర్తు చేస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని జనగామలో కలపడంపై డి ప్యూటీ సిఎం కడియం శ్రీహరి వర్గం తో పాటు అఖిలక్ష నాయకులు వ్యతిరేకిస్తుండగా నియోజకవర్గ ఎమ్మెల్యే - మాజీ డిప్యూటీ సిఎం డాక్టర్ టి. రాజయ్య వర్గం కొత్తగా ఏర్పాటు కానున్న జనగామ జిల్లాలోనే కలపాలని పట్టుపడుతున్నారు. ములుగును కూడా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు. సిఎం కెసిఆర్ కు పిండప్రధానం చేసారు. మొత్తానికి కొత్త జిల్లాల వ్యవహారం పిల్లలకు పప్పుబెల్లం పంచడంలా మారిపోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/