Begin typing your search above and press return to search.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందా ?
By: Tupaki Desk | 21 Oct 2020 1:30 AM GMTప్రపంచ దేశాల్లోని యువతకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గిపోతోందా ? 160 దేశాల్లోని యువతను సర్వే చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చింది. ప్రజాస్వామ్యంపై కేం బ్రిడ్జి యూనివర్సిటి 160 దేశాల్లోని 35 ఏళ్ళులోపుండే యువతను సర్వే చేసింది. ఆ సర్వేలో 48 శాతం మంది మాత్రమే తమకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందని చెప్పారట. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయిన మిగిలిన 52 శాతం మంది తమకు నమ్మకం ఉన్న వ్యవస్ధల గురించి మాత్రం చెప్పలేకపోయారట.
1900, 2000 దశకాల్లో ప్రజాస్వామ్యంపై మూడింట రెండువంతుల మంది ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని చెబితే తాజాగా వాళ్ళ శాతం 48కి పడిపోవటం నిజంగా ఆందోళనకలిగించేదే. అప్పట్లో ప్రజాస్వామ్యంపై 62 శాతం నమ్మకం ఉందని చెబితే ఇపుడు మాత్రం 48 శాతానికి పడిపోవటానికి కారణాలు చాలానే ఉన్నాయని యువత చెప్పారట. రెండో ప్రపంచ యుద్ధం జరిగేనాటికి కూడా జనాల్లో ప్రజాస్వామ్యంలో 54 శాతంమందికి నమ్మకం ఉండేదట.
1950వ దశకంలో కూడా ప్రజాస్వామ్యంపై 57 శాతంమందిలో నమ్మకం ఉన్నా తర్వాత్తర్వాత పెరిగిన యువత ప్రభావం ప్రపంచంలో తలెత్తిన వివిధ పరిణామాల కారణంగా 62 శాతం మందికి నమ్మకం పెరిగింది. అయితే ఈమద్య అమెరికాలోని మిన్నియాపోలీసు స్టేట్ లో మిన్నియాపోలీసు ఓ నల్లజాతీయుడిని చంపారు. ఇంగ్లాండ్ లో జూన్ 7వ తేదీన ఎడ్వర్డ్ కొలస్టన్ విగ్రహాన్ని బద్దలు కొట్టడం తదితర పరిణామాల నేపధ్యంలో యువత ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. యూనివర్సిటి వాళ్ళు మొత్తం మీద 50 లక్షల మందిని సర్వే చేశారంటే మామూలు విషయం కాదు.