Begin typing your search above and press return to search.
జిన్నా టవర్ కూల్చివేతకు ముహూర్తం ఫిక్సయ్యిందా?
By: Tupaki Desk | 25 May 2022 5:47 AM GMTగుంటూరులోని జిన్నాటవర్ కేంద్రంగా బీజేపీ నేతలు కంపు మొదలుపెట్టారు. మంగళవారం జిన్నా టవర్ మీద దాడి చేయటటమే లక్ష్యంగా పలువురు నేతలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు ఆరు మాసాల నుండి జిన్నా టవర్ ను కూల్చేయాలంటే బీజేపీ నేతలు నానా కంపు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం నిర్మించిన జిన్నా టవర్ ను ఇపుడు బీజేపీ నేతలు కూల్చివేత పేరుతో రాజకీయం చేయటమే విచిత్రంగా ఉంది.
అప్పట్లో ముస్లింలీగ్ అగ్రనేత, లాయర్ మహమ్మద్ ఆలీ జిన్నా గుర్తుగా గుంటూరులో ఓ టవర్ ను నిర్మించారు. ఓ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో విజయం సాధించిన కారణంగా జిన్నా గుర్తుగా అప్పట్లో స్థానికులంతా కలిసి ఒక టవర్ ను నిర్మించి దానికి జిన్నా టవర్ గా పేరు పెట్టారు.
అప్పటినుండి ఇప్పటివరకు జిన్నా టవర్ అంటే గుంటూరులో చాలా ఫేమస్. అలాంటి టవర్ ను కూల్చేయాలని లేదా ఆ టవర్ కు అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలని బీజేపీ ఆందోళనలు చేస్తోంది.
ఈ రెండింటిలో ప్రభుత్వం ఏది చేయకపోయినా ఆగష్టు 16వ తేదీన తామే టవర్ ను కూల్చేస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. జిన్నా టవర్ శాంతి కట్టడం కాదంటున్నారు. అంటే అప్పుడెప్పుడో 70 ఏళ్ళక్రితం నిర్మించిన కట్టడానికి కూడా ఇపుడు బీజేపీ నేతలు మతం రంగు పలుముతున్నారన్న విషయం అర్దమైపోతోంది.
అందుకనే గుంటూరు కార్పొరేషన్ ముందు జాగ్రత్తగా టవర్ పైన జాతీయ జెండాను ఎగురవేసింది. గతంలో టవర్ పైన జాతీయ జెండా ఎగరేసింది లేదు. బీజేపీ వివాదాన్ని లేవనెత్తిన తర్వాతే మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ జెండాను ఎగరేసింది.
ఎప్పుడైతే టవర్ కూల్చివేత విషయంలో బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే ముస్లిం సంఘాలు కూడా సంఘటితమయ్యాయి. మొత్తానికి టవర్ ను కూల్చేయటం ద్వారా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలన్న బీజేపీ నేతల ఆలోచనలు స్పష్టమవుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.