Begin typing your search above and press return to search.
మీడియాపై నోట్ల రద్దు ఎఫెక్టు
By: Tupaki Desk | 3 Dec 2016 6:03 AM GMTపెద్ద నోట్ల రద్దు అంశం మీడియా వ్యాపారులను దారుణంగా దెబ్బతీసింది. పత్రికలు - టీవీల్లో ప్రకటనలు ఇచ్చేందుకు వ్యాపారసంస్థలు ముందుకురావడం లేదు. వ్యాపారమే లేనప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అన్నది కంపెనీల భావన. నోట్ల రద్దు వల్ల మీడియా రంగం 2000 వేల కోట్ల మేర ప్రకటనలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నగదు అందుబాటులో లేకపోవడం - వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలో… కార్పొరేట్ సంస్థలు - కంపెనీలు - వాణిజ్య సంస్థలు వ్యాపార ప్రకటనల ఖర్చును తగ్గించుకోక తప్పడం లేదు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన ప్రకటనలను కూడా కంపెనీలు వెనక్కు తీసుకుంటున్నాయి.
పండగలు - పబ్బాలు సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ నిత్యం కనీసం ఒకటైన పూర్తి పేజీ ప్రకటన ఉండే పత్రికలు చాలా ఉన్నాయి. కానీ కొద్దిరోజులుగా హాఫ్ పేజీ యాడ్ కూడా కనిపించడం లేదు. దీంతో తెలుగు మీడియా సంస్థలైతే గగ్గోలు పెడుతున్నాయి. పలు సంస్థలు నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తున్నాయి, టీవీ ఛానళ్లదీ అదే దారి. కానీ, కొన్ని మాత్రం తమకు ఆర్థికంగా నష్టమైనప్పటికీ మోడీ - వెంకయ్యనాయుడు వద్ద ఉన్న మొహమాటంతో మింగలేక కక్కలేక మథన పడిపోతున్నాయి.
తెలుగు మీడియాలో దిగ్గజ సంస్థ అయితే మూడోవంతు యాడ్ రెవెన్యూ తగ్గిపోయిందంటూ టెన్షన్ పడుతోంది. వెంటనే ఖర్చు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా పేజీలు తగ్గించుకునే పనిలో పడింది. టీవీ ఛానళ్లకు కూడా ప్రకటనలు తగ్గడంతో వారంతా మోడీకి వ్యతిరేకంగా.. జనం కష్టాలు చూపిస్తూ కోపం తీర్చుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/