Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు...కుటుంబ నియంత్రణ‌ ఒక్క‌టే

By:  Tupaki Desk   |   23 Dec 2016 4:14 PM GMT
నోట్ల ర‌ద్దు...కుటుంబ నియంత్రణ‌ ఒక్క‌టే
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చేప‌ట్టిన పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. ఏకంగా మోడీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ పాల‌న‌లో బ‌ల‌వంత‌పు కుటుంబ నియంత్రణ రీతిలో మోడీ సైతం ప్ర‌జావ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మోడీ ప్ర‌భుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్ప‌టికీ ప్రజల ఆస్తులనుభారీగా దొంగిలించడం దిగ్భ్రాంతిక‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని మండిప‌డింది. ఫోర్బ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ ఈ మేర‌కు త‌న తాజా క‌థ‌నంలో సంచ‌ల‌న విశ్లేష‌ణ‌లు చేశారు.

పెద్ద నోట్లను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యం ఇప్ప‌టికే గంద‌ర‌గోళంలో ఉన్న‌ సామాన్యుడిని మ‌రింత ఆందోళ‌న ప‌థంలోకి నెట్టింద‌ని ఫోర్బ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ వ్యాఖ్యానించారు. స‌రైన ప్ర‌ణాళిక‌, ముంద‌స్తు అవ‌గాహ‌న లేకుండా ప్ర‌ధాన‌మంత్రి తీసుకున్న ఈ నిర్ణ‌యం ద్వారా ఇటు సామాన్యుడు అటు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్నాయ‌ని విశ్లేషించారు. సుమారు 80 శాతం చెలామ‌ణిలో ఉన్న నోట్ల‌ను ర‌ద్దుచేయ‌డం, త‌దుప‌రి చ‌ర్య‌లను ఆలోచించ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు స్వ‌ల్పంగా ద‌క్కుతుండ‌గా స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స్టీవ్ ఫోర్బ్స్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం చెప్తున్న డిజిట‌లైజేష‌న్ కూడా అంత తేలిక‌గా సాధ్య‌మ‌యే ప‌నికాద‌ని స్టీవ్ ఫోర్బ్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. స్వేచ్ఛా మార్కెట్లకు అనుమతి ఉంటేనే డిజిటైజేషన్ సాధ్యపడుతుందని కానీ ఈ విష‌యంలో స‌రైన ప్ర‌ణాళిక‌లు క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌స్తావించారు. ప‌న్నుల విధానం సరళీకృతం చేయాలని ఆదాయ,వ్యాపార పన్నులను మరింత తగ్గించాలని స్టీవ్ ఫోర్బ్స్ కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేసి ఇటు సామాన్యుల‌కు అటు ప‌రిశ్ర‌మ‌ల వ‌ర్గాల‌కు, ఆర్థ‌ఙ‌క వ్య‌వ‌స్థ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిచే నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్టీవ్ ఫోర్బ్స్ త‌న క‌థ‌నంలో విశ్లేషించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/