Begin typing your search above and press return to search.
గోవాలో కరెన్సీ నోట్ల అవసరమే లేదట
By: Tupaki Desk | 27 Nov 2016 7:23 AM GMTప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కారణంగా కరెన్సీ నోట్ల తిప్పలు ఎంతలా ఉంటాయో తెలుస్తున్న పరిస్థితి. దేశ వ్యాప్తంగా కరెన్సీ కొరత జనాలకు విలవిలలాడుతున్న పరిస్థితి. నోట్ల కోసం బ్యాంకుల ముందు.. ఏటీఎం సెంటర్ల ముందు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంటే.. గోవాలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు.
మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా గోవా ప్రజలు మాత్రం కరెన్సీ నోట్ల కష్టాలు లేనే లేవని చెబుతున్నారు. అభివృద్ధి దేశాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి విధానం.. భారత్ లాంటి దేశంలో పూర్తిగా అమలు కావాలంటే 50 ఏళ్లకు పైనే పడుతుందని కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు వండి వారుస్తున్న వేళ.. అందుకు భిన్నంగా గోవా రాష్ట్రం మొత్తం ఈ విధానంలోకి దాదాపుగా వచ్చేయటం.. డిసెంబరు 31 నాటికి మొత్తంగా వచ్చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. వాస్తవానికి అంచనాకు మధ్య అంతరం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
ఇంతకీ గోవాలో కరెన్సీ నోట్ల కష్టాలు ఎలా తొలిగిపోయాయన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. చిన్న.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి షాపులోనూ స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసుకోవటం.. కరెంటు ఖాతాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఇది సాధ్యమైందని చెబుతున్నారు. వీధుల్లో ఉండే చిన్న చిన్న కూరగాయ షాపుల్లోనూ స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేయటం కనిపిస్తుంది. ఇక.. వినియోగదారులు తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బుల్ని ఫోన్ ద్వారా చెల్లించే విధానంపై అవగాహన పెంచటం.. మొబైల్ ఫోన్లను అద్దెకు ఇచ్చే విధానంతో అక్కడి వారు..ఫోన్ల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారట.
ఇలా.. వస్తువు ఏదైనా సరే..కొనాలనుకుంటే చాలు.. అయితే.. కార్డులు.. లేదంటే చెక్కులు.. ఇవేమీ కాదంటే తమ ఫోన్ల ద్వారా చెల్లింపులు జరిపేస్తున్నారు. ఇదంతా చూస్తే.. మనసు పెట్టి ప్రయత్నిస్తే.. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ మనీని అందుబాటులోకితీసుకు రావటం పెద్ద కష్టంగా అనిపించదు అదే జరిగితే.. 130 కోట్ల భారత్ లో కేవలం 4 శాతం మాత్రమే ఆదాయపన్నుకట్టటం.. కోట్ల మంది వ్యాపారస్తులు పన్నులు ఎగవేత తొలిగిపోవటమే కాదు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వృద్ధి చెందటంఖాయం. అదే జరిగితే.. ఇప్పుడు దారుణంగా ఉన్నట్లు కనిపిస్తున్న పన్ను రేట్లు కూడా తగ్గిపోయే వీలుంది. అదే జరిగితే.. పన్నులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతారనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/