Begin typing your search above and press return to search.
వెయ్యి పించన్ కోసం...వెయ్యి సమర్పణ
By: Tupaki Desk | 17 Dec 2016 4:29 AM GMTపెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులకే కాడు పండు వృద్ధులకు సైతం ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో పించన్ దారుల అవస్తలు వర్ణతీతం. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.1000 పింఛను చేతికి అందాలంటే మరో రూ.1000 తీసుకొచ్చి - బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఇదే విధానం అమలవుతోంది.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం రూ.2000 నోట్లు మాత్రమే అందుబాటులోకి రావడంతో చిల్లర కొరత అధికమైన సంగతి తెలిసిందే. బ్యాంకులకు సైతం కేవలం రూ.2000 నోట్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు సైతం కరెన్సీ కొరతతో బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నాయి. ఈ మొత్తాలు రూ.1000 - రూ.1500గా ఉంటున్నాయి. అయితే బ్యాంకుల వద్ద కేవలం రూ.2000 నోట్లు మాత్రమే ఉండటంతో పింఛను కావలసిన వారు ముందుగా రూ.1000 తమ ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలని పలు చోట్ల బ్యాంకు సిబ్బంది సూచిస్తున్నారు. అనంతరం నగదు విత్ డ్రా చేసుకునేవారికి డిపాజిట్ చేసిన వెయ్యితో కలిపి రూ.2000 నోటు చేతిలో పెడుతున్నారు.ఇక రూ.1500 పింఛనుగా లభించే దివ్యాంగులు రూ.500 కౌంటర్ లో చెల్లిస్తే, వారికి రూ.2000 నోటు అందిస్తున్నారు.
అసలే వచ్చే పింఛనుతో అంతంతమాత్రంగా బతుకీడుస్తున్న వృద్ధులు - వితంతువులు - దివ్యాంగులు ఈ అదనపు మొత్తాల కోసం పరుగులు తీయడమే కాక, ఆ మొత్తాలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మరిన్ని గంటల సేపు క్యూలో నిల్చోవాల్సివస్తోందని వాపోతున్నారు. ఇంత చేసినా బ్యాంకు సిబ్బంది ఇచ్చిన రూ.2000 నోటుకు మార్కెట్లో చిల్లర దొరకక ఏం చేసుకోవాలో తెలియడంలేదని పేర్కొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/