Begin typing your search above and press return to search.
ట్రాన్స్ ట్రాయ్ దుకాణ్ బంద్ అయినట్టేనా?
By: Tupaki Desk | 5 Jan 2018 11:27 AM GMTపోలవరం పనుల్లో ప్రధాన కాంట్రాక్టరు.. ట్రాన్స్ ట్రాయ్ సంస్థ దుకాణ్ బంద్ అయినట్టేనా? ఇప్పుడు అందరిలోనూ అదే సందేహాలు కలుగుతున్నాయి. పనులు వేగంగా చేయలేక - సబ్ కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించకుండా ఈసురోమని పనులు సాగిస్తున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఇక పూర్తిగా మూత పడినట్లే అనే ప్రచారం మొదలైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కు చెందినదిగా ప్రచారంలో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ పోలవరం పనుల్లో ప్రధాన కాంట్రాక్టరుగా పనులు దక్కించుకుంది. అంచనా వ్యయం సవరణల రూపేణా ప్రభుత్వం వారికి పలుమార్లు సహకరించింది. అయినా సంస్థ పనులను వేగంగా చేసింది మాత్రం లేదు. తాజా వివాదం ఏంటంటే.. ఈ సంస్థ తమ బ్యాంకు చెల్లించాల్సిన 120 కోట్ల రుణానికి సంబంధించి.. పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన దేనా బ్యాంకు అధికారులు... కోర్టు ఆదేశాల దన్నుతో ఈ సంస్థకు చెందిన యంత్రాలను సీజ్ చేశారు. తాము క్లియరెన్స్ ఇచ్చే వరకు మళ్లీ పనులు చేపట్టడానికి కూడా లేదని హెచ్చరించి వెళ్లారు.
అసలే ట్రాన్స్ ట్రాయ్ పనులు సక్రమంగా చేయలేకపోతున్నందున కొన్ని కీలకమైన పనులను వారినుంచి తప్పించి.. కొత్తగా టెండర్లు పిలవాలని చంద్రబాబునాయుడు చాలా కాలంనుంచి పట్టుపడుతున్నారు. మాకే సమయం ఇవ్వండి, కొత్త ధరలు ఇవ్వండి చేస్తాం అని ట్రాన్స్ ట్రాయ్ అడుగుతున్నప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. పాత ఒప్పందం ప్రకారం చేసేట్లయితే.. ఇదే కాంట్రాక్టరుతో చేయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటూ వస్తున్నారు. మరోవైపు ట్రాన్స్ ట్రాయ్ తమకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించలేదంటూ.. వారి సబ్ కాంట్రాక్టరు గాయత్రి కన్ స్ట్రక్షన్స్ వారు పనులు ఆపేయడం కూడా వివాదాస్పదమే అయింది.
ఇన్ని తలనొప్పులు చుట్టుముడుతూ ఉన్న నేపథ్యంలో.. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా.. మరో రెండు కీలక పరిణామాలు శుక్రవారం నాడు చోటు చేసుకున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కు చేతకావడం లేదని తేలిపోతున్న నేపథ్యంలో కొన్ని పనులను వారినుంచి తప్పించి.. కొత్త టెండర్లు పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్ ట్రాయ్ కు ఇదొక విషాద వార్త అయితే.. దేనా బ్యాంకు వారు సైట్ కు వచ్చి తమ అప్పు వసూలు నిమిత్తం అక్కడున్న సంస్థ యంత్రాలన్నిటినీ సీజ్ చేసేశారు. ఈ బ్యాంకు కు ట్రాన్స్ ట్రాయ్ 75 కోట్ల రుణం ఉండగా - వడ్డీలతో కలిపి అది 120 కోట్లకు చేరి ఉంది. అలాగే మరో కెనరా బ్యాంకు కూడా ట్రాన్స్ ట్రాయ్ తమకు 725 కోట్ల రుణం చెల్లించాల్సి ఉన్నదంటూ హైదరాబాదులోని కంపెనీ లా ట్రిబ్యునల్ ఆశ్రయించి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో.. ట్రాన్స్ ట్రాయ్ దుకాణ్ బంద్ అయినట్లే అని పలువురు భావిస్తున్నారు.