Begin typing your search above and press return to search.
భర్తతో శృంగారాన్ని నిరాకరించడం.. క్రూరత్వం.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు
By: Tupaki Desk | 5 March 2022 3:57 AM GMTవివాహంలో లైంగిక సంబంధాన్ని నిరాకరించడం క్రూరత్వానికి సమానమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను విచారించిన కోర్టు.. విడాకులు మంజూరు చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆరోగ్యకరమైన దాంపత్యానికి శారీరక సంబంధం తప్పనిసరి అని జస్టిస్ పి సామ్ కోశి, పార్థ ప్రతీమ్ సాహులతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
"ఈ కేసులో భార్య క్రూరత్వం చేసిందని మేము నమ్ముతున్నాము. ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం తప్పనిసరి. గత 10 సంవత్సరాలుగా దంపతుల మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. అందువల్ల మేము అప్పీలుదారుని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. పిటిషనర్ భార్య క్రూరంగా ప్రవర్తించింది" అని ధర్మాసనం పేర్కొంది.
బిలాస్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి నవంబర్ 25, 2007న బెమెతర జిల్లాకు చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత, ఆ వ్యక్తి భార్య 2008లో తీజ్ పండుగ కోసం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆమె రక్షాబంధన్ తర్వాత తన భర్త వద్దకు తిరిగి వచ్చింది. జూలై 2011లో పిటిషనర్ తండ్రి చనిపోయాడు. ఈ సమయంలో, మహిళ తన భర్తతో కొంతకాలం ఉంటూ మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.
2010 తర్వాత, అన్ని ముఖ్యమైన పండుగలు, పుట్టినరోజుల కోసం అంటూ కాలం గడేపేసి.. సదరు మహిళ తన భర్త వద్దకు నాలుగు సంవత్సరాలకు పైగా తిరిగి రాలేదు. అనంతరం.. ఆమె జూలై 26, 2014న తన ఇంటికి తిరిగి వచ్చి, మళ్లీ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో విసిగిపోయిన భర్త.. ఇంటికి తిరిగి రావాలని పదే పదే కోరాడు. ఫోన్లు కూడా చేశాడు. అయితే.. తాను తిరిగి వచ్చేది లేదని.. తాను తన పుట్టింటి వద్దే ఉంటానని.. తాను కావాలంటే.. తన భర్తను బెమెతరలో వచ్చి స్థిరపడాలని కోరింది.దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భర్త.. 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.
అయితే, కుటుంబ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను 2017 , డిసెంబరు 13న తిరస్కరించింది. దీంతోఆయన ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు.. విడాకులు మంజూరు చేసింది.